బ్లాక్ టిక్కెట్‌ల వ్య‌వ‌హారంలో దిల్‌రాజ్‌పై కేసు న‌మోదు

బాహుబ‌లి టిక్కెట్లను బ్లాక్‌లో విక్ర‌యించ‌డాన్ని ప్రోత్స‌హిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై సినీ నిర్మాత దిల్ రాజుపై కేసు న‌మోదైంది. తెలుగులో అద్భుత‌మైన సెట్ల‌తో, 250 కోట్ల పెట్టుబ‌డితో నిర్మిత‌మై మెగా మూవీగా వాసికెక్కిన బాహుబ‌లి రేపు విడుద‌ల‌వుతుంది. ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న ధియేట‌ర్ల వ‌ద్ద, మ‌ల్టీపెక్స్‌ల వ‌ద్ద  అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్ల కోసం వేలాది మంది ప్రేక్ష‌కులు ప‌డిగాపులు ప‌డుతున్నారు. దీన్ని అద‌నుగా తీసుకుని సినీ నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్ అయిన దిల్ రాజు బ్లాక్ టికెట్ల అమ్మ‌కాన్ని ప్రోత్స‌హిస్తున్నార‌ని ఆరోపిస్తూ ఫిర్యాదు చేయ‌గా పోలీసులు ఆయ‌న‌పై కేసు న‌మోదు చేశారు.