Telugu Global
Cinema & Entertainment

హ్యారి పోట‌ర‌మ్మాయి బాలీవుడ్ లో ..!

బాలీవుడ్  ప‌రిథి పెరుగుతుంది. ప్ర‌పంచంలో హాలీవుడ్ త‌రువాత ..అతిపెద్ద మార్కెట్ వున్నది బాలీవుడ్ కే అని చెప్పాలి.  దీంతో  కొంద‌రు హాలీవుడ్ న‌టీమ‌ణులు కూడా బాలీవుడ్ లో  క‌నిపించ‌డానికి  ఇష్ట‌ప‌డుతుంటారు. ఇదే త‌ర‌హాలో    హ్యారీపోట‌ర్ బేబి  ఎమ్మా వాట్స‌న్  బాలీవుడ్ లో న‌టించే అవకాశం ఉంద‌నే రూమ‌ర్స్  హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.  ప్ర‌ముఖ పాత్రికేయుడు జ్యోతిర్మ‌యి డే  జీవితం ఆధారంగా   నందితా సింఘా అనే ద‌ర్శ‌కురాలు ఒక సినిమాను  ప్లాన్ చేస్తున్నార‌ట‌.మాఫీయాకు వ్య‌తిరేకంగా వార్త‌లు రాసిన కార‌ణంగా […]

హ్యారి పోట‌ర‌మ్మాయి బాలీవుడ్ లో ..!
X

బాలీవుడ్ ప‌రిథి పెరుగుతుంది. ప్ర‌పంచంలో హాలీవుడ్ త‌రువాత ..అతిపెద్ద మార్కెట్ వున్నది బాలీవుడ్ కే అని చెప్పాలి. దీంతో కొంద‌రు హాలీవుడ్ న‌టీమ‌ణులు కూడా బాలీవుడ్ లో క‌నిపించ‌డానికి ఇష్ట‌ప‌డుతుంటారు. ఇదే త‌ర‌హాలో హ్యారీపోట‌ర్ బేబి ఎమ్మా వాట్స‌న్ బాలీవుడ్ లో న‌టించే అవకాశం ఉంద‌నే రూమ‌ర్స్ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ప్ర‌ముఖ పాత్రికేయుడు జ్యోతిర్మ‌యి డే జీవితం ఆధారంగా నందితా సింఘా అనే ద‌ర్శ‌కురాలు ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నార‌ట‌.మాఫీయాకు వ్య‌తిరేకంగా వార్త‌లు రాసిన కార‌ణంగా ఆయ‌న హ‌త్య‌కు గురైయారు. ఆయ‌న జీవితాన్ని ప్ర‌పంచానికి తెలియ చేయాల‌నే ఈ సినిమాను చేస్తున్నార‌ట ద‌ర్శ‌కురాలు…ఈ పాత్ర‌కు ఎమ్మా వాట్స‌న్ అయితే అంత‌ర్జాతీయ గుర్తింపు వ‌స్తుంద‌ని ..ఈ దిశ‌గా డైరెక్ట‌ర్ ఈ హాట్ బ్యూటీని అప్రోచ్ అవుతున్న‌ట్లు బాలీవుడ్ టాక్. ఒక వేళ హ్యారిపోట‌ర్ బేబికి స్టోరి న‌చ్చి ఓకే చేస్తే.. మ‌న బాలీవుడ్ లో ఎమ్మా కు అభిమాన గ‌ణం ఏర్పడ‌టం ఖాయం.

First Published:  9 July 2015 10:00 AM GMT
Next Story