Telugu Global
Cinema & Entertainment

లోఫర్ ప్రారంభమైంది

చిరంజీవితో 150వ సినిమా చేయట్లేదని ఇప్పటికే ప్రకటించిన దర్శకుడు పూరి జగన్నాధ్.. ఆ వెంటనే లోఫర్ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. ఈ సినిమా నిన్ననే లాంఛనంగా ప్రారంభమైంది. దేవుడి పటాలపై తొలి క్లాప్ కొట్టారు. ఈరోజు నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తిచేస్తారు. ఈనెల 20 నుంచి ఓ నెల రోజుల పాటు జోధ్ పూర్ లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. సి.కల్యాణ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. […]

లోఫర్ ప్రారంభమైంది
X
చిరంజీవితో 150వ సినిమా చేయట్లేదని ఇప్పటికే ప్రకటించిన దర్శకుడు పూరి జగన్నాధ్.. ఆ వెంటనే లోఫర్ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. ఈ సినిమా నిన్ననే లాంఛనంగా ప్రారంభమైంది. దేవుడి పటాలపై తొలి క్లాప్ కొట్టారు. ఈరోజు నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తిచేస్తారు. ఈనెల 20 నుంచి ఓ నెల రోజుల పాటు జోధ్ పూర్ లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. సి.కల్యాణ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. నిజానికి ఇదే సినిమాను నితిన్ తో తీయాలనుకున్నాడు పూరి జగన్నాధ్. కానీ తెరవెనక కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు స్వయంగా నితినే ప్రకటించాడు. తర్వాత ఆ కథ నాగబాబు దగ్గరకు వెళ్లడం.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. సినిమా స్టార్టవ్వడం అన్నీ చకచకా జరిగిపోయాయి. మొన్నటివరకు క్రిష్ దర్శకత్వంలో కంచె సినిమా చేశాడు వరుణ్ తేజ్. ఆ సినిమా షూటింగ్ ఈమధ్యే పూర్తయింది. మళ్లీ ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లిపోయాడు. ఈ సినిమాలో హీరోయన్ ఎవరనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తారు. మూవీని అక్టోబర్ చివరినాటికి విడుదల చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.
First Published:  8 July 2015 8:00 PM GMT
Next Story