Telugu Global
Others

వ్యాపం స్కాంపై సీబీఐ విచారణకు సుప్రీం ఆదేశం

మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాల్జేసి కేంద్ర ప్రభత్వ విశ్వనీయతను ప్రశ్నార్థకం చేసిన వ్యవసాయక్‌ పరీక్షా మండలి (వ్యాపం) కుంభకోణంపై నిశితంగా విచారణ జరపాలని సుప్రీంకోర్టు గురువారం సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ)ని ఆదేశించింది. ఈకేసుపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఇందులో అనేక కీలకాంశాలు ఇమిడి ఉన్నాయని, దీనిపై సీబీఐ విచారణ జరపడం అవసరమని అభిప్రాయపడింది. దీంతో సుప్రీం సీబీఐ విచారణకు ఆదేశిస్తూనే కేంద్రానికి, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వానికి, గవర్నర్‌ రామ్‌ నరేష్‌ యాదవ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. […]

వ్యాపం స్కాంపై సీబీఐ విచారణకు సుప్రీం ఆదేశం
X
మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాల్జేసి కేంద్ర ప్రభత్వ విశ్వనీయతను ప్రశ్నార్థకం చేసిన వ్యవసాయక్‌ పరీక్షా మండలి (వ్యాపం) కుంభకోణంపై నిశితంగా విచారణ జరపాలని సుప్రీంకోర్టు గురువారం సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ)ని ఆదేశించింది. ఈకేసుపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఇందులో అనేక కీలకాంశాలు ఇమిడి ఉన్నాయని, దీనిపై సీబీఐ విచారణ జరపడం అవసరమని అభిప్రాయపడింది. దీంతో సుప్రీం సీబీఐ విచారణకు ఆదేశిస్తూనే కేంద్రానికి, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వానికి, గవర్నర్‌ రామ్‌ నరేష్‌ యాదవ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. మా దగ్గర ఉన్న కేసులన్నింటినీ కూడా సీబీఐకి బదిలీ చేస్తున్నామని, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు సంఘం (సిట్‌ ), ఎస్‌టిఎఫ్‌తో తమకు సంబంధం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీబీఐ దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకుందని, దీనికి ఏవేవో కుంటిసాకులు చెబుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.
రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ న‌రేష్ యాద‌వ్‌, ఆయ‌న దివంగ‌త పుత్రుడు, ముఖ్య‌మంత్రి శివ‌రాజ్‌సింఘ్ చౌహాన్‌, ఆయ‌న భార్య‌, పుత్ర‌ర‌త్నం, ప‌లువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌, సీనియ‌ర్ అధికారులు ఉన్న‌ట్టు ఆరోప‌ణ‌లున్న ఈ కుంభ‌కోణంలో 2009 నుంచి సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించ‌కుండా దాటేసుకుంటూ వ‌స్తోంది. ఇప్ప‌టికే ఈ కుంభ‌కోణానికి సంబంధించి 49 మంది ప్రాణాలు కోల్పోవ‌డ‌మో, తీసుకోవ‌డ‌మో జ‌రిగింది. హ‌త్య‌లు, ఆత్మ‌హ‌త్య‌లు, అనుమానాస్ప‌ద మ‌ర‌ణాలు ఈ స్కాం ప్ర‌త్యేకం. సీబీఐ ద‌ర్యాప్తున‌కు తాము సుముఖ‌మేన‌ని సీఎం శివరాజ్‌సింఘ్‌ చౌహాన్ బుధవారమే ప్ర‌క‌టించడం, సరిగ్గా ఒకరోజు తర్వాత సుప్రీంకోర్టు కూడా సీబీఐ దర్యాప్తుకు ఆదేశించడంతో ఈ కుంభకోణంతో సంబంధమున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రాజకీయ నాయకులు, ఉద్యోగులు, విద్యార్థులు..ఇలా ఎంతో మందితో ఈ స్కాం ముడిపడి ఉంది. పైగా అనేకమంది నిరుద్యోగులు, వారి కుటుంబసభ్యులు దీనివల్ల ఎన్నో అవస్థలకు గురయ్యారు. ఈస్కాం వల్ల అనేకమందికి అర్హతలుండి కూడా అవకాశాలు రాలేదు. అనర్హులెంతోమంది లబ్ది పొందారు. 2009 నుంచి 2014 మధ్య కాలంలో ప్రముఖ మెడికల్ కాలేజ్‌ జీఎస్ వీ ఎమ్ లో సుమారు 54 మంది వ్యాపం స్కాంలో భాగంగానే అడ్మిషన్లు పొందినట్లు దర్యాప్తులో తేలింది. రాష్ట్రవ్యాప్తంగా ఇలా అడ్మిషన్లు పొందిన విద్యార్థులను గతంలో విచారణ కోసం మధ్యప్రదేశ్‌ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అదుపులోకి తీసుకుంది. విద్యార్థులో అందులో భాగంగా అరెస్టయ్యారు. వీరిలో 22 మంది బెయిల్ మీద బయటకు వచ్చి మళ్లీ కాలేజ్‌లో జాయిన్ అయ్యారు. ఆరుగురు ఇప్పటికీ జైల్లో వున్నారు. 8 మంది ఆచూకీ మాత్రం లేదు. వీరంతా 2013 ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా అడ్మిషన్ పొందారు. ఇపుడు సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో వ్యాపం స్కాం ముందు, వెనుక పాత్రధారులు, సూత్రధారులు బయటకు వస్తారని భావిస్తున్నారు.
First Published:  9 July 2015 2:20 AM GMT
Next Story