Telugu Global
Cinema & Entertainment

తెలంగాణ లో బాహుబ‌లి రిలీజ్ ను అడ్డుకుంటారా...!

తెలుగు జాతి గ‌ర్వంగా చెప్పుకునే సినిమా గా చెబుతున్న బాహుబ‌లి  ఇంకొన్ని గంట‌ల్లో రిలీజ్ కు సిద్దం అవుతుంది. అయితే  ఈ లోపు  అన్ని పెద్ద చిత్రాల‌కు  కామ‌న్ గా ఎదురువుతున్న  కాంట్ర‌వ‌ర్స‌రీ  బెడ‌ద చుట్టుకుంది.  ఈ సినిమాలో   మాల సామాజిక వ‌ర్గాన్ని కించ ప‌రిచే స‌న్నివేశాలేవో వున్నాయంటూ…తెలంగాణ మాల‌ల జేఎసి  చైర్మ‌న్ దీపిక్ కుమార్  డిమాండ్ చేశారు. సినిమాలో ఆ సీన్స్ తొలిగించ‌క పోతే తెలంగాణ లో బాహుబ‌లి  విడుద‌ల‌ను అడ్డుకుంటామంటూ  అల్లిమేటం జారి చేశారు. […]

తెలంగాణ లో బాహుబ‌లి రిలీజ్ ను అడ్డుకుంటారా...!
X

తెలుగు జాతి గ‌ర్వంగా చెప్పుకునే సినిమా గా చెబుతున్న బాహుబ‌లి ఇంకొన్ని గంట‌ల్లో రిలీజ్ కు సిద్దం అవుతుంది. అయితే ఈ లోపు అన్ని పెద్ద చిత్రాల‌కు కామ‌న్ గా ఎదురువుతున్న కాంట్ర‌వ‌ర్స‌రీ బెడ‌ద చుట్టుకుంది. ఈ సినిమాలో మాల సామాజిక వ‌ర్గాన్ని కించ ప‌రిచే స‌న్నివేశాలేవో వున్నాయంటూ…తెలంగాణ మాల‌ల జేఎసి చైర్మ‌న్ దీపిక్ కుమార్ డిమాండ్ చేశారు. సినిమాలో ఆ సీన్స్ తొలిగించ‌క పోతే తెలంగాణ లో బాహుబ‌లి విడుద‌ల‌ను అడ్డుకుంటామంటూ అల్లిమేటం జారి చేశారు. యూట్యూబ్ లో మాల‌ల్ని కించ ప‌రుస్తూ ప్ర‌సార‌మైన క్లిప్పింగ్స్ ను ఇప్ప‌టికే పోలీసుల‌కు అంద చేశార‌ట‌. ఈ విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం కూడా జోక్యం చేసుకోవాల‌ని దీప‌క్ కుమార్ కోరారు.మ‌రి ఇంకొన్ని గంట‌ల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు ఈ స‌మ‌స్య ఏంటో …!

First Published:  8 July 2015 10:31 PM GMT
Next Story