Telugu Global
Cinema & Entertainment

త్రివిక్రమ్ కు నాగార్జున ఝలక్

తన పంచ్ లతో ప్రేక్షకులను అలరించే త్రివిక్రమ్ కే పంచ్ ఇచ్చాడు నాగార్జున. ఎప్పుడూ ఎదురుకాని సమాధానం త్రివిక్రమ్ కు ఎదురైంది. తను స్క్రిప్ట్ రాస్తే హీరోలు ఎగిరి గంతేస్తారనుకునే త్రివిక్రమ్ కు నాగార్జున బ్రేకులేశాడు. త్రివిక్రమ్ నెరేట్ చేసిన ఓ స్టోరీలైన్ అస్సలు బాగాలేదని దర్శకుడి మొహం మీదే చెప్పేశాడట నాగార్జున. దీంతో అవాక్కవ్వడం త్రివిక్రమ్ వంతయింది. ఇప్పటివరకు త్రివిక్రమ్ కు ఎప్పుడూ ఇలాంటి సమాధానం ఎదురుకాలేదు. మార్పులేమైనా ఉంటే చెప్పేవారు తప్ప.. ఇలా అస్సలు […]

త్రివిక్రమ్ కు నాగార్జున ఝలక్
X
తన పంచ్ లతో ప్రేక్షకులను అలరించే త్రివిక్రమ్ కే పంచ్ ఇచ్చాడు నాగార్జున. ఎప్పుడూ ఎదురుకాని సమాధానం త్రివిక్రమ్ కు ఎదురైంది. తను స్క్రిప్ట్ రాస్తే హీరోలు ఎగిరి గంతేస్తారనుకునే త్రివిక్రమ్ కు నాగార్జున బ్రేకులేశాడు. త్రివిక్రమ్ నెరేట్ చేసిన ఓ స్టోరీలైన్ అస్సలు బాగాలేదని దర్శకుడి మొహం మీదే చెప్పేశాడట నాగార్జున. దీంతో అవాక్కవ్వడం త్రివిక్రమ్ వంతయింది. ఇప్పటివరకు త్రివిక్రమ్ కు ఎప్పుడూ ఇలాంటి సమాధానం ఎదురుకాలేదు. మార్పులేమైనా ఉంటే చెప్పేవారు తప్ప.. ఇలా అస్సలు బాగాలేదని ఎవరూ అనలేదు. అఖిల్ రెండో సినిమా కోసం త్రివిక్రమ్ ఓ స్టోరీలైన్ రెడీ చేశాడట. దాన్ని నాగార్జునకు వినిపించాడని సమాచారం. సోగ్గాడే చిన్ని నాయనా సెట్స్ లో ఈ స్టోరీలైన్ విన్న నాగార్జున, అస్సలు బాగాలేదని త్రివిక్రమ్ మొహం మీదే చెప్పేశాడట. దీంతో మరో స్టోరీలైన్ సిద్ధం చేసే పనిలో బిజీ అయిపోయాడు త్రివిక్రమ్.
First Published:  9 July 2015 10:00 PM GMT
Next Story