Telugu Global
Others

పీఎస్‌ఎల్‌వీ-28 ప్రయోగం విజయవంతం

అంతరిక్షంలో కాంతులీనుతున్నభారత ఖ్యాతి  భారత అంతరిక్ష సంస్థ… ఇస్రో… మరో చరిత్రకు నాంది పలికింది. ఐదు అతిపెద్ద వాణిజ్య ఉపగ్రహాలను ఒకేసారి పీఎస్‌ఎల్వీ-28 అంతరిక్షంలోకి పంపించి ప్రపంచానికి తన సత్తా ఏమిటో మరోసారి చాటి చెప్పింది. శ్రీహరికోటలోని థావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది. 1992లో ఇస్రో వాణిజ్య అవసరాల కోసం ఏర్పాటైన యాంత్రిక్‌ సంస్థ ఈ ఉపగ్రహాల ప్రయోగాన్ని చేపట్టింది. ఇతర దేశాలకు, ఇస్రోకు మధ్య అనుసంధానకర్తగా యాంత్రిక్‌ కార్పొరేషన్‌ వ్యవహరిస్తోంది. కార్పొరేషన్‌ […]

పీఎస్‌ఎల్‌వీ-28 ప్రయోగం విజయవంతం
X

అంతరిక్షంలో కాంతులీనుతున్నభారత ఖ్యాతి
భారత అంతరిక్ష సంస్థ… ఇస్రో… మరో చరిత్రకు నాంది పలికింది. ఐదు అతిపెద్ద వాణిజ్య ఉపగ్రహాలను ఒకేసారి పీఎస్‌ఎల్వీ-28 అంతరిక్షంలోకి పంపించి ప్రపంచానికి తన సత్తా ఏమిటో మరోసారి చాటి చెప్పింది. శ్రీహరికోటలోని థావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది. 1992లో ఇస్రో వాణిజ్య అవసరాల కోసం ఏర్పాటైన యాంత్రిక్‌ సంస్థ ఈ ఉపగ్రహాల ప్రయోగాన్ని చేపట్టింది. ఇతర దేశాలకు, ఇస్రోకు మధ్య అనుసంధానకర్తగా యాంత్రిక్‌ కార్పొరేషన్‌ వ్యవహరిస్తోంది. కార్పొరేషన్‌ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు ఈ సంస్థ ఇస్రోకు 4,408 కోట్ల రూపాయల ఆదాయాన్ని సముపార్జించింది. దీనివల్ల భారత్‌కు విదేశీ మారక ద్రవ్యం గణనీయంగా లభిస్తోంది. 1440 కిలోల ప్లేలోడ్‌ కలిగిన ఈ ఐదు ఉపగ్రహాలు విజయవంతంగా ప్రయోగించడంతో ఏడేళ్ళపాటు ఇవి సేవలందిస్తాయి. ప్రస్తుతం ప్రయోగానికి అయిన మొత్తం ఖర్చును అంటే దాదాపు 180 కోట్ల రూపాయలను బ్రిటన్‌ భరిస్తుంది. ఇప్పటికే 19 దేశాలకు చెందిన 40 ఉపగ్రహాలు అంతరిక్షంలో ఉన్నాయి. వీటన్నింటినీ ఇస్రోయే ప్రయోగించింది. ఇది నిజంగా చారిత్రాత్మక విషయం. ప్రపంచంలో ఏ దేశానికి దక్కని ఖ్యాతి భారత్‌కు దక్కినట్టయ్యింది. ఈ ఐదు ఉపగ్రహాల్లో మూడు భూ పరిశీలనకు ఉపయోగపడతాయి. శుక్రవారం రాత్రి విజయవంతంగా కక్ష్యలోకి పంపిన ఈ ఐదు ఉపగ్రహాల ప్రయోగానికి సంబంధించి ఈ నెల ఏడో తేదీన కౌంట్‌డౌన్‌ ప్రారంభమయ్యింది. వాణిజ్యపరమైన ఈ ఐదు ఉపగ్రహాలు విజయవంతం కావడంతో ప్రపంచానికి సవాలు విసిరినట్టయ్యింది. ఇస్రో మూలంగా అంతరిక్షంలో భారతదేశం ఖ్యాతి కాంతులీనుతోంది.

First Published:  10 July 2015 12:13 PM GMT
Next Story