Telugu Global
Cinema & Entertainment

శంక‌ర్  రియ‌ల్ మ‌ల్టీ స్టార‌ర్ ఫిల్మ్ హ్యండిల్ చేస్తాడా...!

రోబో సినిమా త‌రువాత‌.. శంక‌ర్ చేసిన స్నేహ‌తుడు..   ఐ చిత్రాలు రెండు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా ప‌డ్డాయి.   దీంతో  శంక‌ర్  కు  రోబో సీక్వెల్ చేయ‌క త‌ప్ప‌డం లేదు. ఈ సినిమా మొద‌టి భాగం హిట్ కావ‌డంతో..  ఎలాగైన ఈ సీక్వెల్ తో బౌన్స్ బ్యాక్ కావాల‌ని  ఆశ ప‌డుతున్నారు. ఇందులో భాగంగా ఈ సీక్వెల్ కు సంబంధించిన స్క్రీప్ట్ వ‌ర్క్.. ప్రి ప్రోడ‌క్ష‌న్ వ‌ర్క్ చాల గోప్యంగా చేయిస్తున్నార‌నే టాక్.  రోబో్  సీక్వెల్ లో    త‌మిళ […]

శంక‌ర్  రియ‌ల్ మ‌ల్టీ స్టార‌ర్ ఫిల్మ్ హ్యండిల్ చేస్తాడా...!
X

రోబో సినిమా త‌రువాత‌.. శంక‌ర్ చేసిన స్నేహ‌తుడు.. ఐ చిత్రాలు రెండు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా ప‌డ్డాయి. దీంతో శంక‌ర్ కు రోబో సీక్వెల్ చేయ‌క త‌ప్ప‌డం లేదు. ఈ సినిమా మొద‌టి భాగం హిట్ కావ‌డంతో.. ఎలాగైన ఈ సీక్వెల్ తో బౌన్స్ బ్యాక్ కావాల‌ని ఆశ ప‌డుతున్నారు. ఇందులో భాగంగా ఈ సీక్వెల్ కు సంబంధించిన స్క్రీప్ట్ వ‌ర్క్.. ప్రి ప్రోడ‌క్ష‌న్ వ‌ర్క్ చాల గోప్యంగా చేయిస్తున్నార‌నే టాక్.

రోబో్ సీక్వెల్ లో త‌మిళ స్టార్ హీరో విక్ర‌మ్ విల‌న్ రోల్ చేస్తున్నార‌నే టాక్ కూడా వినిపిస్తుంది.ర‌జ‌నీకాంత్ లీడ్ రోల్ చేస్తుండ‌గా… ఆయ‌న స‌ర‌స‌న బాలీవుడ్ న‌టిమ‌ణి విద్యాబాల‌న్ న‌టించ‌నుంద‌నే టాక్ వినిపిస్తుంది. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. ..ఈసినిమాకు మ‌రో స్ట‌న్నింగ్ రూమ‌ర్ ఏమిటంటే.. హాలీవుడ్ ఐర‌న్ మ్యాన్ అర్నాల్డ్ స్కార్జేన‌క‌ర్ ఈ చిత్రంలో ఒక కీరోల్ పోషిస్తార‌నే టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా ఆడియో విడుద‌ల‌కు ఆర్నాల్డ్ గెస్ట్ గా వ‌చ్చేసిన విష‌యం తెలిసిందే. నిజంగా ఈ న్యూస్ అన్ని నిజం అయితే.. కోలీవుడ్ లో రియ‌ల్ మ‌ల్టీ స్టార‌ర్ ఫిల్మ్ వ‌స్తున్న‌ట్లే.. అయితే శంక‌ర్ మ‌ల్టీ స్టార‌ర్ ఫిల్మ్ ను హ్యండిల్ చేయ‌గ‌ల‌డా అనే సందేహాం క్ర‌టిక్స్ కు క‌లుగుతుంద‌నే టాక్ ఉంది. ఎందుకంటే శంక‌ర్ సినిమాలో క‌థ‌లే హీరోలుగా ఉంటాయి. అటువంటి ద‌ర్శ‌కుడు ఈ మ‌ధ్య కొంత వెన‌క బ‌డ్డాడు. ఇటువంటి త‌రుణంలో స్టార్స్ ను హ్యండిల్ చేయ‌డం అంటే మాట‌లు కాదు క‌దా..! అయితే కోలీవుడ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేక‌ర్స్ లో ఒక‌రైన శంక‌ర్ ఈ ప్రాజెక్ట్ తో దుమ్ము లేప‌డం ఖాయం అంటున్నారు ఆయ‌న ఫ్యాన్స్.

First Published:  9 July 2015 7:00 PM GMT
Next Story