అమెరికాలో బాహుబ‌లి వ‌సూళ్ళ రికార్డు

భారత చలన చిత్ర చరిత్రలోనే అతి పెద్ద మోషన్ పిక్చర్‌ను రూపొందించిన ఎస్‌ఎస్ రాజమమౌళి స్వప్నం శుక్రవారం సాకారమైంది. ప్రపంచవ్యాప్తంగా 4 వేల థియేటర్లలో బాహుబలి విడుదలయింది. అన్నిచోట్లా ఈ చిత్రం దిగ్విజయంగా ప్రదర్శించబడుతూ సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ చిత్రానికి విశేష స్పందన వస్తోంది. ఓపెనింగ్ కనెక్షన్‌లలో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ పీకేను బాహుబలి అధిగమించింది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద బాహుబలి మొదటి రోజు కలెక్షన్ అమీర్ ఖాన్ పీకే మూవీని మించి వసూలు చేసింది. బాహుబలి మొదటి రోజు వసూళ్ళు రూ. 82 కోట్లు కాగా, పీకే తొలి రోజు కలెక్షన్ రూ.62 కోట్లు మాత్రమే.