Telugu Global
Others

గోదావ‌రిలో మున‌క క‌ష్ట‌మే...! పుష్క‌ర స్నానం మ‌మ‌!

గోదావ‌రి పుష్క‌రాల‌ను మ‌రో మ‌హా కుంభ‌మేళాగా నిర్వ‌హిస్తామ‌న్న తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు మాట‌లు గోదారి నీటిమూట‌ల‌య్యాయి. రాష్ట్రంలో చాలా చోట్ల పుష్క‌ర ఏర్పాట్లు పూర్తి కాలేదు. మ‌రోరెండు రోజుల్లో (14వ తారీఖునుంచి) పుష్క‌రాలు ప్రారంభ‌మ‌వుతున్నాయి. ఘాట్ల‌లో ఏర్పాట్లు అసంపూర్తిగా ఉన్నాయి. అంతేకాదు గోదావ‌రిలో నీళ్లు కూడా అంతంత‌మాత్రంగానే ఉన్నాయి. ముక్కు మూసుకుని న‌దిలో మూడు మున‌క‌లు వేసి పుష్క‌ర‌స్నానం  చేయ‌డం క‌ష్ట‌మే. తెలంగాణ‌కే త‌ల‌మానిక‌మైన పుణ్య‌క్షేత్రం బాస‌ర‌లో గోదావ‌రి అడుగంటిపోయింది. ఒడ్డున అక్క‌డ‌క్క‌డా హ‌డావిడిగా బోర్లు […]

గోదావ‌రిలో మున‌క క‌ష్ట‌మే...! పుష్క‌ర స్నానం మ‌మ‌!
X
గోదావ‌రి పుష్క‌రాల‌ను మ‌రో మ‌హా కుంభ‌మేళాగా నిర్వ‌హిస్తామ‌న్న తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు మాట‌లు గోదారి నీటిమూట‌ల‌య్యాయి. రాష్ట్రంలో చాలా చోట్ల పుష్క‌ర ఏర్పాట్లు పూర్తి కాలేదు. మ‌రోరెండు రోజుల్లో (14వ తారీఖునుంచి) పుష్క‌రాలు ప్రారంభ‌మ‌వుతున్నాయి. ఘాట్ల‌లో ఏర్పాట్లు అసంపూర్తిగా ఉన్నాయి. అంతేకాదు గోదావ‌రిలో నీళ్లు కూడా అంతంత‌మాత్రంగానే ఉన్నాయి. ముక్కు మూసుకుని న‌దిలో మూడు మున‌క‌లు వేసి పుష్క‌ర‌స్నానం చేయ‌డం క‌ష్ట‌మే. తెలంగాణ‌కే త‌ల‌మానిక‌మైన పుణ్య‌క్షేత్రం బాస‌ర‌లో గోదావ‌రి అడుగంటిపోయింది. ఒడ్డున అక్క‌డ‌క్క‌డా హ‌డావిడిగా బోర్లు త‌వ్వించిన అధికారులు ష‌వ‌ర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆ ష‌వ‌ర్ల కింద త‌ల‌కాయ‌లు త‌డుపుకుని పుష్క‌ర స్నానం పూర్త‌యింద‌ని సంతృప్తి ప‌డాలన్న‌మాట‌. ఆ ష‌వ‌ర్ల‌లో వ‌చ్చేనీరు గోదావ‌రి నీరేన‌ని, అందువ‌ల్ల పుష్క‌ర స్నానం చేయ‌డం వ‌ల్ల వ‌చ్చే పుణ్యానికి ఎలాంటి ఢోకా లేద‌ని అధికారులు చెబుతున్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాత్రం మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌కు, ముఖ్య‌మంత్రికి ఫోన్లు చేసి అభ్య‌ర్థిస్తున్నారు. ఎగువ‌న రిజ‌ర్వాయ‌ర్ల‌లోని నీటిని విడుద‌ల చేస్తే తాము పుష్క‌రాల గండం నుంచి గ‌ట్టెక్కుతామ‌ని అడుగుతున్నారు. కానీ అటువైపు నుంచి స్పంద‌న నిల్‌. తెలంగాణ రాష్ట్రంలోని రిజ‌ర్వాయ‌ర్ల‌లోని నీటిని మాత్రం న‌దిలోకి విడుద‌ల చేయాల‌ని ఇరిగేష‌న్ శాఖ మంత్రి హ‌రీష్‌రావు అధికారుల‌ను ఆదేశించిన‌ట్లు స‌మాచారం. అయినా ఆ నీటితో న‌ది క‌ళ‌క‌ళ‌లాడ‌డం క‌ష్ట‌మే. పుష్క‌ర స్నానం చేయాల‌ను కునే భ‌క్తులు నాలుగు చుక్క‌లు నెత్తిపై జ‌ల్లుకునేందుకే అవి స‌రిపోతాయి.
First Published:  10 July 2015 8:50 PM GMT
Next Story