త్రివిక్రమ్ ను ఊరిస్తున్న నితిన్

బడా హీరోల్ని పక్కనపెట్టి ఆ తర్వాత శ్రేణి హీరోలతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు త్రివిక్రమ్. ఎందుకుంటే పవన్, మహేష్ లాంటి స్టార్లు ఎవరూ ప్రస్తుతానికి కాల్షీట్లు కేటాయించే పరిస్థితి లేదు. దీంతో త్రివిక్రను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాడు హీరో నితిన్. ప్రస్తుతం నితిన్ దగ్గర కొన్ని కాల్షీట్లు సిద్ధంగా ఉన్నాయి. త్రివిక్రమ్ కూడా ఖాళీగా ఉన్నాడు. కాబట్టి స్టార్ డైరక్టర్ తో ఓ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టేయాలని చూస్తున్నాడు. దీనికోసం ఫ్యాన్స్ ఆఫర్లతో త్రివిక్రమ్ ను ఊరిస్తున్నాడు నితిన్. తను హీరోగా, తన బ్యానర్ పై సినిమా చేస్తే లాభాల్లో వాటా ఇస్తానంటున్నాడు. నైజాం రైట్స్ తో పాటు శాటిలైట్ రైట్స్ కలిపి తీసుకోమంటున్నాడట. నితిన్ చూపిస్తున్న భారీ ఆఫర్లను త్రివిక్రమ్ కూడా కాదనలేకపోతున్నాడు. కానీ అక్కినేని అఖిల్ తో ఓ సినిమా చేద్దామని అనుకుంటున్నాడు త్రివిక్రమ్. ఇప్పటికే ఓ కథ సిద్ధం చేస్తే దాన్ని నాగార్జున తిరస్కరించాడు. మరి అదే కథతో నితిన్ తో సినిమా చేస్తాడా.. లేక అఖిల్ కోసం మరో కొత్త కథ రాసుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది. మొత్తమ్మీద త్రివిక్రమ్ ఎవరితో సినిమా చేస్తాడనే విషయం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.