Telugu Global
Others

పొగాకు రైతుల‌కు మ‌ద్ద‌తుగా వైఎస్ఆర్‌సీపీ పోరాటం

14న ధ‌ర్నాలు… అవ‌స‌ర‌మైతే పొగాకు బోర్డు ముట్ట‌డి.. పొగాకు రైతులకు మ‌ద్ద‌తుగా ప్ర‌భుత్వంపై పోరాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ది. ఇటీవ‌లే ఆ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో పొగాకు రైతుల‌ను క‌లుసుకుని వారి స‌మ‌స్య‌లను అడిగి తెలుసుకున్నారు. గిట్టుబాటు ధ‌ర క‌ల్పించ‌డంతోపాటు పొగాకును ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేయాల‌ని ఆయ‌న అల్టిమేట‌మ్ జారీ చేశారు. అయినా ప్ర‌భుత్వం నుంచి స్పంద‌న క‌నిపించ‌క‌పోవ‌డంతో మ‌రో అడుగు ముందుకేయాల‌ని పార్టీ సంక‌ల్పించింది. పొగాకు రైతుల‌కు మ‌ద్ద‌తుగా వివిధ ర‌కాల […]

పొగాకు రైతుల‌కు మ‌ద్ద‌తుగా వైఎస్ఆర్‌సీపీ పోరాటం
X
14న ధ‌ర్నాలు… అవ‌స‌ర‌మైతే పొగాకు బోర్డు ముట్ట‌డి..
పొగాకు రైతులకు మ‌ద్ద‌తుగా ప్ర‌భుత్వంపై పోరాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ది. ఇటీవ‌లే ఆ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో పొగాకు రైతుల‌ను క‌లుసుకుని వారి స‌మ‌స్య‌లను అడిగి తెలుసుకున్నారు. గిట్టుబాటు ధ‌ర క‌ల్పించ‌డంతోపాటు పొగాకును ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేయాల‌ని ఆయ‌న అల్టిమేట‌మ్ జారీ చేశారు. అయినా ప్ర‌భుత్వం నుంచి స్పంద‌న క‌నిపించ‌క‌పోవ‌డంతో మ‌రో అడుగు ముందుకేయాల‌ని పార్టీ సంక‌ల్పించింది. పొగాకు రైతుల‌కు మ‌ద్ద‌తుగా వివిధ ర‌కాల ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. గిట్టుబాటు ధర కల్పించకపోతే గుంటూరు పొగాకు బోర్డును ముట్టడిస్తామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయ‌న విమ‌ర్శించారు. గత ఏడాది పొగాకు కిలో రూ.174 ఉంటే ఈ ఏడాది రూ.110 నుంచి 117 గా ఉందని అన్నారు. పొగాకు కొనుగోలు విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంద‌ని మండిపడ్డారు. గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నో సార్లు విజ్ఞప్తి చేసినా ప్ర‌భుత్వం పెడచెవిన పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యలకు నిరసనగా ఈ నెల 14న పొగాకు అమ్మే అన్ని ప్లాట్‌ఫాంల దగ్గర వైఎస్‌ఆర్‌ సిపి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే గుంటూరు పొగాకు బోర్డును ముట్టడిస్తామని స్పష్టం చేశారు. కనీసం పొగాకు కిలో రూ.150 వరకైనా పెంచాలని డిమాండ్‌ చేశారు. పొగాకు పంటకు మద్దతు ధర లేక టంగుటూరులో కొండల్‌రావు అనే రైతు గుండెపోటుతో మరణించిన గుర్తు చేస్తూ, ఆ రైతు కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
First Published:  10 July 2015 9:03 PM GMT
Next Story