Telugu Global
Cinema & Entertainment

బాలీవుడ్‌లో హీరోగా బ్రెట్‌లీ!

ఆస్ట్రేలియ‌న్‌ మాజీ ఫాస్ట్ బౌల‌ర్ బ్రెట్‌లీ ఇప్పుడు హీరో అవ‌తారం ఎత్తాడు! బ్రెట్ లీ ఏంటి ఏకంగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వ‌డ‌మేంటి.. అనుకుంటున్నారా?  చాలామందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే?  బాలీవుడ్ లో బ్రెట్‌లీ తెరంగ్రేట్రం కొత్త‌దేం కాదు! కొన్నేళ్ల క్రితం ప్ర‌ముఖ గాయ‌ని ఆశా భోంస్లేతో క‌లిసి ఒక పాప్ ఆల్బ‌మ్ కూడా విడుద‌ల చేశాడు. అది సూప‌ర్ హిట్ అయింది. పైగా బ్రెట్‌లీ మంచి డ్యాన్స‌ర్‌, సింగ‌ర్‌, న‌టుడు కూడా. బ్రెట్లీ న‌టిస్తున్న చిత్రం పేరు […]

బాలీవుడ్‌లో హీరోగా బ్రెట్‌లీ!
X

ఆస్ట్రేలియ‌న్‌ మాజీ ఫాస్ట్ బౌల‌ర్ బ్రెట్‌లీ ఇప్పుడు హీరో అవ‌తారం ఎత్తాడు! బ్రెట్ లీ ఏంటి ఏకంగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వ‌డ‌మేంటి.. అనుకుంటున్నారా? చాలామందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే? బాలీవుడ్ లో బ్రెట్‌లీ తెరంగ్రేట్రం కొత్త‌దేం కాదు! కొన్నేళ్ల క్రితం ప్ర‌ముఖ గాయ‌ని ఆశా భోంస్లేతో క‌లిసి ఒక పాప్ ఆల్బ‌మ్ కూడా విడుద‌ల చేశాడు. అది సూప‌ర్ హిట్ అయింది. పైగా బ్రెట్‌లీ మంచి డ్యాన్స‌ర్‌, సింగ‌ర్‌, న‌టుడు కూడా. బ్రెట్లీ న‌టిస్తున్న చిత్రం పేరు అన్ఇండియ‌న్‌. చిత్రం మొత్తం సిడ్నీలో చిత్రీక‌రించారు. విడాకులు తీసుకుని ప‌దేళ్ల‌కూతురు ఉన్న ఓ భార‌తీయ‌మ‌హిళ మీరా (త‌నీషా ఛ‌ట‌ర్జీ) తో విల్ (బ్రెట్ లీ) ప్రేమ‌లో ప‌డ‌తాడు. అప్ప‌టి నుంచి ఇద్ద‌రికీ స‌మ‌స్య‌లు మొద‌లవుతాయి. భార‌తీయ‌మ‌హిళ‌నా? అని విల్ స్నేహితులు, ఆస్ర్టేలియ‌న్‌ను ఎందుకు పెళ్లి చేసుకుంటావ‌ని మీరా త‌ల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు అభ్యంతరం చెబుతారు. దీంతో మీరా కుటుంబ స‌భ్యుల‌ను, బంధువుల‌ను, కూతుర్ని ఒప్పించ‌డానికి బ్రెట్‌లీ ప‌డే పాట్లు అన్నీ ఇన్నీ కావు. భార‌తీయ‌- సంప్ర‌దాయం, రెండో పెళ్లికి ఎదుర‌య్యే ఇబ్బందుల చుట్టూ తిరిగే కామెడీ క‌థ‌. ఈ ఇబ్బందుల‌ను మొత్తం అధిగ‌మించి విల్ త‌న ప్రేమ‌ను ఎలా గెలిపించుకున్నాడు. మీరాను ఎలా పెళ్లిచేసుకున్నాడ‌న్న‌ది క‌థాంశం. ఇంత‌కాలం ఫాస్ట్ బౌలింగ్‌తో బెంబేలెత్తించిన బ్రెట్‌లీ ఇక‌పై హీరోగా డాన్సులు, న‌ట‌న‌తో అల‌రించనున్నాడు.

First Published:  11 July 2015 9:00 PM GMT
Next Story