Telugu Global
NEWS

బంగారు తెలంగాణకు ఇంజినీర్లది బహుముఖ పాత్ర

బంగారు తెలంగాణ నిర్మాణంలో ఇంజినీర్లంతా భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పిలుపు ఇచ్చారు. నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జన్మదినాన్ని పురస్కరించుకొని రవీంద్రభారతిలో ఇంజినీర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ గొప్ప ఇంజినీర్ అయిన నవాబ్ అలీని ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తూనే మరోవైపు కొత్త ప్రాజెక్టులు […]

బంగారు తెలంగాణకు ఇంజినీర్లది బహుముఖ పాత్ర
X
బంగారు తెలంగాణ నిర్మాణంలో ఇంజినీర్లంతా భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పిలుపు ఇచ్చారు. నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జన్మదినాన్ని పురస్కరించుకొని రవీంద్రభారతిలో ఇంజినీర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ గొప్ప ఇంజినీర్ అయిన నవాబ్ అలీని ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తూనే మరోవైపు కొత్త ప్రాజెక్టులు కూడా చేపడుతుందన్నారు. సీఎం కేసీఆర్ ఈ నాలుగేండ్లలో 40 ఏండ్ల అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారని, ఇంజినీర్లు 30-35 సంవత్సరాల్లో చేసే పనులను ఈ మూడేండ్లలో చేయాల్సి ఉంటుందన్నారు. పాలమూరు ఎత్తిపోతలకు సంబంధించిన గత ఫైళ్లను చూస్తుంటే తనకు ఎంతో బాధ కలిగిందని ప్రభుత్వ సలహాదారు (ఇరిగేషన్) ఆర్ విద్యాసాగర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. 2005లోనే తాను, రిటైర్డ్ ఇంజినీర్ శ్యాంప్రసాద్‌రెడ్డి మరికొందరు కలిసి పాలమూరు అధ్యయన వేదికగా ఏర్పడి ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశామన్నారు. ఆ తర్వాత ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మాజీ ఎంపీ విఠల్‌రావు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌కు వెంటనే ఈ ప్రాజెక్టును చేపట్టాలని లేఖ రాశారని అన్నారు. అయితే, ఆయన “ప్లీజ్… ఇన్వెస్టిగేట్‌” అని రాసి ఊరుకున్నారని ఆయన తెలిపారు. సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ గోల్కొండలో బయటపడిన కోహినూర్ వజ్రం లండన్‌ తరలిపోతే… లండన్‌లో చదువుకున్న నవాబ్ అలీ నవాజ్ జంగ్ అనే వజ్రం హైదరాబాద్ స్టేట్‌లో విశిష్ట సేవలందించిందన్నారు.
First Published:  12 July 2015 1:15 AM GMT
Next Story