Telugu Global
Others

చిక్కుల్లో లోకేశ్ బాబు!

తెర‌పై క‌న్నా ట్వీట‌ర్‌లోనే ఎక్కువ‌గా క‌నిపించే లోకేశ్‌బాబు నేరుగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. గ‌త మేనెల‌లో ఒబామాను కలిసేందుకు లోకేశ్ పెట్టిన ఖర్చే ఇప్పుడు తాజా వివాదానికి కేంద్రంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి పెట్టుబడులను ఆకర్షించేందుకంటూ మే నెలలో లోకేశ్ అమెరికాలో పర్యటించారు. అదే స‌మయంలో అమెరికా ఎన్నిక‌ల నిధుల స‌మీక‌ర‌ణ‌లో భాగంగా ఒబామాను క‌లిసేందుకు లోకేశ్ 10,000 డాల‌ర్లు వెచ్చించి టికెట్ కొని ఒబామాతో కరచాలనం చేసే అవకాశం సంపాదించారని వార్తలొచ్చాయి. ఒబామాను కలిసి తీయించుకున్న‌ […]

చిక్కుల్లో లోకేశ్ బాబు!
X
తెర‌పై క‌న్నా ట్వీట‌ర్‌లోనే ఎక్కువ‌గా క‌నిపించే లోకేశ్‌బాబు నేరుగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. గ‌త మేనెల‌లో ఒబామాను కలిసేందుకు లోకేశ్ పెట్టిన ఖర్చే ఇప్పుడు తాజా వివాదానికి కేంద్రంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి పెట్టుబడులను ఆకర్షించేందుకంటూ మే నెలలో లోకేశ్ అమెరికాలో పర్యటించారు. అదే స‌మయంలో అమెరికా ఎన్నిక‌ల నిధుల స‌మీక‌ర‌ణ‌లో భాగంగా ఒబామాను క‌లిసేందుకు లోకేశ్ 10,000 డాల‌ర్లు వెచ్చించి టికెట్ కొని ఒబామాతో కరచాలనం చేసే అవకాశం సంపాదించారని వార్తలొచ్చాయి. ఒబామాను కలిసి తీయించుకున్న‌ ఫొటోను కూడా ఆయన విడుదలచేశారు. అమెరికా చట్టాల ప్రకారం ఏ పార్టీ ఎన్నికల నిధికైనా కేవలం అమెరికన్ పౌరులు మాత్రమే విరాళాలు ఇవ్వాలి. విదేశీయులు, అందునా విదేశీ రాజకీయ నాయకులు, పార్టీలు ఎట్టిపరిస్థితుల్లోనూ విరాళాలు ఇవ్వకూడదు. ఒక వేళ క‌లిసినా, ఆ విషయాన్ని తమ సొంత ప్రచారం కోసం వాడుకోకూడదు. అమెరికా సమాఖ్య ఎన్నికల ప్రచార చట్టం (ఎఫ్‌ఈసీఏ)- 1971లో ఈ విషయం స్పష్టంగా ఉంది. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే జరిమానా లేదా జైలుశిక్ష విధిస్తారు. ఒక్కోసారి రెండూ విధించే అవకాశం ఉంది. దాంతో ఒబామాను కలిసేందుకు విదేశీయుడైన లోకేశ్ చట్టవ్యతిరేకంగా విరాళం ఇచ్చాడని ప్రవాస భారతీయుడు, డెమోక్రటిక్ పార్టీ రిజిస్టర్ సభ్యుడు నాగేందర్‌రావు మాధవరం గత నెల 24న అమెరికా సమాఖ్య ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేశారు. ఈ ఫిర్యాదును ఎంయూఆర్ 6946 నంబర్‌తో రిజిస్టర్ చేశామని, ఇంకా ఏమైనా ఆధారాలున్నా వెంటనే పంపాలని సమాఖ్య ఎన్నికల సంఘం అసిస్టెంట్ జనరల్ కౌన్సిల్ జెఫ్ ఎస్ జోర్డాన్ మాధ‌వ‌రానికి స‌మాచారం అందించారు. దీని ఆధారంగా లోకేశ్‌కు నోటీసులు జారీ చేసే అవ‌కాశం ఉంద‌ని న్యాయ‌నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.
First Published:  11 July 2015 10:54 PM GMT
Next Story