Telugu Global
Cinema & Entertainment

బాహుబలికి ఎక్స్ ట్రా ఫీచర్స్

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది బాహుబలి. ఏరియాస్ తో సంబంధం లేకుండా కళ్లుచెదిరే వసూళ్లు రాబడుతోంది. ఓ వైపు సినిమాపై నెగెటివ్ టాక్ నడుస్తున్నప్పటికీ బాహుబలి ప్రభంజనం ముందు అదేదీ పనిచేయడం లేదు. కానీ బాహుబలి టీం మాత్రం ఆ నెగెటివ్ కామెంట్స్ ను సీరియస్ గా తీసుకుంది. సినిమా క్లయిమాక్స్ ను హడావిడిగా ముగించేశారనేది ఆ నెగెటివ్ కామెంట్స్ లో ప్రధానమైంది. దీనిపై బాహుబలి యూనిట్ సీరియస్ గానే దృష్టిపెట్టింది. సినిమా బాగున్నప్పటికీ, క్లైమాక్స్ […]

బాహుబలికి ఎక్స్ ట్రా ఫీచర్స్
X
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది బాహుబలి. ఏరియాస్ తో సంబంధం లేకుండా కళ్లుచెదిరే వసూళ్లు రాబడుతోంది. ఓ వైపు సినిమాపై నెగెటివ్ టాక్ నడుస్తున్నప్పటికీ బాహుబలి ప్రభంజనం ముందు అదేదీ పనిచేయడం లేదు. కానీ బాహుబలి టీం మాత్రం ఆ నెగెటివ్ కామెంట్స్ ను సీరియస్ గా తీసుకుంది. సినిమా క్లయిమాక్స్ ను హడావిడిగా ముగించేశారనేది ఆ నెగెటివ్ కామెంట్స్ లో ప్రధానమైంది. దీనిపై బాహుబలి యూనిట్ సీరియస్ గానే దృష్టిపెట్టింది. సినిమా బాగున్నప్పటికీ, క్లైమాక్స్ ను తొందరగా తేల్చేశారనే విమర్శలకు చెక్ పెట్టాలనుకుంటోంది. అందుకే సినిమా క్లైమాక్స్ కు ముందు అదనంగా కొన్ని సన్నివేశాల్ని జోడించాలని నిర్ణయించుకున్నారు. ఎడిటింగ్ దశలో తొలిగించేసిన కొన్ని సన్నివేశాల్ని క్లైమాక్స్ కు ముందు ఫ్రెష్ గా యాడ్ చేయాలని నిర్ణయించారు. దీంతో ముగింపు మరింత బలంగా ఉంటుందని భావిస్తోంది యూనిట్. దీనివల్ల మరో అదనపు లాభం కూడా ఉంది. ఇప్పటికే సినిమాను చూసిన ప్రేక్షకులు కూడా అదనపు సన్నివేశాల కోసం మరోసారి థియేటర్లకు వచ్చే అవకాశముంది.
First Published:  12 July 2015 2:00 AM GMT
Next Story