Telugu Global
NEWS

గోదావ‌రి పుష్క‌రాల‌కు అఘోరాలు

శివ సాధువులైన అఘోరాలు ప‌విత్ర గోదావ‌రి పుష్క‌రాల‌కు త‌ర‌లివ‌స్తున్నారు. వార‌ణాసిలోనూ, గంగా ప‌రీవాహ‌క ప్రాంతాల‌లో క‌నిపించే అఘోరాలు మ‌హా కుంభ‌మేళా స‌మ‌యంలో సంద‌డి చేసిన సంగ‌తి తెలిసిందే. ఇపుడు గోదావ‌రి పుష్క‌రాల సంద‌ర్భంగా తెలుగు రాష్ర్టాల‌లోని సుప్ర‌సిద్ధ శైవ క్షేత్రాల‌కు అఘోరాలు వ‌స్తున్నార‌ని స‌మాచారం. శ‌రీర‌మంతా బూడిద రాసుకుని చేతిలో భిక్ష‌పాత్ర‌తో క‌నిపించే అఘోరాల జీవ‌న‌శైలి చాలా భిన్నంగా ఉంటుంది. వ‌స్త్రధార‌ణ కూడా విభిన్నంగా ఉంటుంది. నార‌తో చేసిన వ‌స్త్రాన్ని మాత్ర‌మే వాడ‌తారు. కేవ‌లం గోచీ మాత్ర‌మే […]

గోదావ‌రి పుష్క‌రాల‌కు అఘోరాలు
X
శివ సాధువులైన అఘోరాలు ప‌విత్ర గోదావ‌రి పుష్క‌రాల‌కు త‌ర‌లివ‌స్తున్నారు. వార‌ణాసిలోనూ, గంగా ప‌రీవాహ‌క ప్రాంతాల‌లో క‌నిపించే అఘోరాలు మ‌హా కుంభ‌మేళా స‌మ‌యంలో సంద‌డి చేసిన సంగ‌తి తెలిసిందే. ఇపుడు గోదావ‌రి పుష్క‌రాల సంద‌ర్భంగా తెలుగు రాష్ర్టాల‌లోని సుప్ర‌సిద్ధ శైవ క్షేత్రాల‌కు అఘోరాలు వ‌స్తున్నార‌ని స‌మాచారం. శ‌రీర‌మంతా బూడిద రాసుకుని చేతిలో భిక్ష‌పాత్ర‌తో క‌నిపించే అఘోరాల జీవ‌న‌శైలి చాలా భిన్నంగా ఉంటుంది. వ‌స్త్రధార‌ణ కూడా విభిన్నంగా ఉంటుంది. నార‌తో చేసిన వ‌స్త్రాన్ని మాత్ర‌మే వాడ‌తారు. కేవ‌లం గోచీ మాత్ర‌మే ధ‌రిస్తారు. ఎక్కువమంది దిగంబ‌రులుగానే సంచ‌రిస్తారు. పులిచ‌ర్మాన్ని కూడా ఆచ్ఛాద‌న‌గా వాడ‌తారు. రుద్రాక్ష‌ల‌ను క‌పాల మాల‌ల‌ను ధ‌రిస్తారు. వీరికి అద్భుత‌మైన అతీంద్రియ శ‌క్తులుంటాయ‌ని శివ‌భక్తులు విశ్వ‌సిస్తారు. మారిజువానా అనే మాద‌క‌ద్ర‌వ్యాన్ని సేవిస్తారు. మ‌ద్యం, మాంసం, మైథునం విష‌యంలో అఘోరా సాధువుల‌కు ఎలాంటి ప‌ట్టింపులూ లేవు. కుండ‌లినీ యోగ సాధ‌న చేస్తారు. వీరు ప్ర‌ద‌ర్శించే యోగ‌ముద్ర‌లు సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురిచేస్తాయి.
First Published:  12 July 2015 10:38 PM GMT
Next Story