Telugu Global
Others

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన విశ్వవిద్యాలయం

రాష్ట్రంలో ఇంధన విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది. ఇంధన సామర్థ్యం పెంపు, విద్యుత్‌ పొదుపు, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు, వాటి పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యల పై పరిశోధనలు బోధనాంశాలుగా ఈ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తొలిదశలో పోస్టు గ్రాడ్యుయేషన్‌, పీహెచ్‌డీ, పరిశోధన కోర్సులను ప్రవేశ పెట్టనున్నారు. అనంతరం దీన్ని డిగ్రీ స్థాయి వరకు తీసుకెళ్లనున్నారు. ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటులో ప్రభుత్వం ప్రైవేటు విద్యుత్‌ సంస్థల నుంచి ఆర్థిక సహకారాన్ని తీసుకోవాలని నిర్ణయించింది. దీనికి కేంద్ర […]

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన విశ్వవిద్యాలయం
X
రాష్ట్రంలో ఇంధన విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది. ఇంధన సామర్థ్యం పెంపు, విద్యుత్‌ పొదుపు, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు, వాటి పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యల పై పరిశోధనలు బోధనాంశాలుగా ఈ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తొలిదశలో పోస్టు గ్రాడ్యుయేషన్‌, పీహెచ్‌డీ, పరిశోధన కోర్సులను ప్రవేశ పెట్టనున్నారు. అనంతరం దీన్ని డిగ్రీ స్థాయి వరకు తీసుకెళ్లనున్నారు. ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటులో ప్రభుత్వం ప్రైవేటు విద్యుత్‌ సంస్థల నుంచి ఆర్థిక సహకారాన్ని తీసుకోవాలని నిర్ణయించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకారం తెలియజేసింది రాష్ట్రంలోని ఈస్టర్న్‌, సదరన్‌ డిస్కమ్‌లు, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్‌లతోపాటు ప్రైవేటు రంగానికి చెందిన ప్రముఖ విద్యుత్‌ సంస్థలు ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. పారిశ్రామిక అంశాలపైనా ఇందులో బోధన ఉంటుంది. ప్రాక్టికల్స్‌, ఇండిస్టీయల్‌ అప్లికేషన్స్‌ ప్రధానంగా విద్యార్థులకు బోధన కొనసాగిస్తారు.
కర్నూలు సౌర పార్కు పూర్తి విద్యుత్‌ రాష్ట్రానికే
కర్నూలు జిల్లా గని, సకినాల గ్రామాల పరిధిలో ఏర్పాటు కానున్న 1000 మెగావాట్ల సౌర విద్యుత్‌ పార్కును రాష్ట్రానికి చెందేలా కేంద్రం నిర్ణయం తీసుకుందని ఇంధనం, మౌలికం, పెట్టుబడుల శాఖ కార్యదర్శి అజయ్‌ జైన్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల విద్యుత్‌ సరఫరా పథకం అమలు చేస్తున్నందున కేంద్రం ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకుందని ఆదివారం ఇక్కడ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సౌరవిద్యుత్‌ పార్కులో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను వందశాతం రాష్ట్రానికే కేటాయిస్తామని కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ ఇటీవల ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారని చెప్పారు. దీనితోపాటు అనంతపురం జిల్లా నంబులపూలకుంటలో ఎన్టీపీసీ యాజమాన్యం నిర్మించదలిచిన అల్ట్రా మెగా సౌర పార్కు విద్యుత్‌లో 90 శాతం వాటా రాష్ట్రానికే దక్కుతుందని అజయ్‌ జైన్‌ చెప్పారు. రాష్ట్రంలో సౌరవిద్యుత్‌ రంగంలో 20 వేల మెగావాట్ల ఉత్పత్తికి పెట్టుబడులు పెట్టడానికి ముందు కొచ్చారని చెప్పారు.
First Published:  13 July 2015 9:49 AM GMT
Next Story