Telugu Global
Cinema & Entertainment

బాలీవుడ్ కు షాకిచ్చిన బాహుబలి

బాహుబలి సినిమాను బాలీవుడ్ స్టార్ డైరక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ టేకప్ చేసినప్పుడు అంతా షాకయ్యారు. హిందీలో ఎంతో క్రేజ్ పెట్టుకున్న కరణ్.. ఓ సౌత్ సినిమాపై ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని అంతా ఆరాలు తీశారు. కానీ బాలీవుడ్ లో బాహుబలి విడుదలైన తర్వాత కరణ్ ఎందుకు ఆ ప్రాజెక్టులోకి ఎంటరయ్యాడో అందరికీ అర్థమైపోయింది. అవును.. బాలీవుడ్ ప్రేక్షకుల్నే కాదు.. బాలీవుడ్ ప్రముఖుల్ని కూడా బాహుబలి షాక్ కు గురిచేసింది. అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిన గ్రాఫిక్స్, […]

బాలీవుడ్ కు షాకిచ్చిన బాహుబలి
X
బాహుబలి సినిమాను బాలీవుడ్ స్టార్ డైరక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ టేకప్ చేసినప్పుడు అంతా షాకయ్యారు. హిందీలో ఎంతో క్రేజ్ పెట్టుకున్న కరణ్.. ఓ సౌత్ సినిమాపై ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని అంతా ఆరాలు తీశారు. కానీ బాలీవుడ్ లో బాహుబలి విడుదలైన తర్వాత కరణ్ ఎందుకు ఆ ప్రాజెక్టులోకి ఎంటరయ్యాడో అందరికీ అర్థమైపోయింది. అవును.. బాలీవుడ్ ప్రేక్షకుల్నే కాదు.. బాలీవుడ్ ప్రముఖుల్ని కూడా బాహుబలి షాక్ కు గురిచేసింది. అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిన గ్రాఫిక్స్, అద్భుతమైన కథనాన్ని చూసి సల్మాన్ లాంటి హీరో సైతం ఫిదా అయిపోయాడు. ఓపెన్ గా మీడియా ముందుకొచ్చి బాహుబలి టీంను మెచ్చుకున్నాడు. మరీ ముఖ్యంగా రానాపై ప్రశంసలు కురిపించాడు. అటు సల్మాన్ తో పాటు సిద్దార్థ్ మల్హోత్రా, ఉపేన్ పటేల్ లాంటి నటులు కూడా బాహుబలికి ఫిదా అయిపోయారు. ఇక హీరోయిన్లలో అయితే పరిణీతి చోప్రా, విద్యాబాలన్ లాంటి తారలు బాహుబలిని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఓ సౌత్ సినిమాకు బాలీవుడ్ లో 50కోట్ల వసూళ్లు రావడం వింతగా ఉందని ఆశ్చర్యపోయింది పరిణీతి. అటు విద్యాబాలన్ అయితే సినిమాపై స్పందించడానికి మాటలందడం లేవంటూ చెప్పుకొచ్చింది. రాబోయే రెండు రోజుల్లో ఈ సినిమాను అమీర్ ఖాన్ కూడా చూసే అవకాశముంది.
First Published:  13 July 2015 1:47 AM GMT
Next Story