Telugu Global
Others

అల్లం టీ తో ఆస్త‌మాకు చెక్‌!

అల్లం మ‌సాలా దినుసు మాత్ర‌మే అని చాలా మంది భావిస్తుంటారు. కానీ అల్లంతో అనేక ఉప‌యోగాలున్నాయి. అల్లంలో యాంటియోక్సిడెంట్స్  పుష్క‌లంగా ఉన్నాయి. రోజూ ఒక కప్పుఅల్లం టీని తీసుకుంటే జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది. భుక్తాయాసం మ‌టుమాయ‌మ‌వుతుంది.  రోజుకో కప్పు చొప్పున  అల్లం టీ తాగితే… శ్వాసకోశ సంబంధ సమస్యలు అదుపులో ఉంటాయి. ఆస్తమా, దగ్గులకు చెక్ పెట్టాలంటే అల్లం ‘ టీ ‘ రోజూ  తేనెతో కలిపి తీసుకోవాలి. అల్లం టీ వ‌ల్ల రక్త ప్రసరణ […]

అల్లం టీ తో ఆస్త‌మాకు చెక్‌!
X
అల్లం మ‌సాలా దినుసు మాత్ర‌మే అని చాలా మంది భావిస్తుంటారు. కానీ అల్లంతో అనేక ఉప‌యోగాలున్నాయి. అల్లంలో యాంటియోక్సిడెంట్స్ పుష్క‌లంగా ఉన్నాయి. రోజూ ఒక కప్పుఅల్లం టీని తీసుకుంటే జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది. భుక్తాయాసం మ‌టుమాయ‌మ‌వుతుంది. రోజుకో కప్పు చొప్పున అల్లం టీ తాగితే… శ్వాసకోశ సంబంధ సమస్యలు అదుపులో ఉంటాయి. ఆస్తమా, దగ్గులకు చెక్ పెట్టాలంటే అల్లం ‘ టీ ‘ రోజూ తేనెతో కలిపి తీసుకోవాలి. అల్లం టీ వ‌ల్ల రక్త ప్రసరణ నియంత్రణలో ఉంటుంది. అల్లంలో ఉండే ఖనిజ లవణాలు గుండెకు మేలు చేస్తాయి. హృదయ కవాటాల్లో రక్త సరఫరా సక్రమంగా ఉండటానికి దోహదపడతాయి. హృద్రోగాలూ దూరంగా ఉంటాయి. నెలసరి సమస్యలూ అదుపులోకి వస్తాయి. టీ తాగడం వల్ల శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు అధికశాతం అందుతాయి. రోగనిరోధక శక్తి పెరిగి, ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. దీనిలో ఉండే అరోమా గుణాలు మెదడును ఉత్తేజితం చేస్తాయి. అల్లం టీ ఉదయం తాగితే రోజంతా హుషారుగా ఉంచుతుంది. అల్లం టీ ని సేవించడం ద్వారా గర్భిణీలకు ఎంతో మేలు చేకూరుతుందట. వేవిళ్లకు చెక్ పెట్టడంలో అల్లం టీ దివ్యౌషధంగా పనిచేస్తుంది. సాధారణ టీలో అల్లం బిస్కెట్లు తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఛాతిలో మంట, అజీర్ణం వంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే అల్లం ‘ టీ ‘ తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే అల్లం టీని సేవించడం ద్వారా మోకాలి నొప్పులు, కీళ్ల నొప్పులు దరిచేరవు. మోకాళ్ల వాపులు కూడా అల్లం ‘ టీ ‘ రోజూ తీసుకుంటే తగ్గిపోతాయి. అలాగే ఏ అనారోగ్యంతో బాధపడేవారు అల్లం టీని సేవిస్తే ఉపశమనం లభిస్తుంది. జలుబు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పితో బాధపడేవారు అల్లం టీ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు రోజుకు మూడుసార్లు అల్లంతో తయారైన హెర్బల్ టీని తాగచ్చు. అల్లం టీని సేవించడం ద్వారా ఒత్తిడిని తగ్గించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
First Published:  12 July 2015 11:54 PM GMT
Next Story