Telugu Global
NEWS

అక్ర‌మాన్ని అడ్డుకున్న వైకాపా ఎమ్మెల్యేపై దాడి!

ఇసుక అక్ర‌మ ర‌వాణ చేస్తున్న ఎమ్మెల్యేను, ఆయ‌న వ‌ర్గీయుల‌ను అడ్డుకున్నందుకు ముసునూరు తాహ‌సిల్దారుపై దాడి జ‌రిపిన కేసు ఇంకా వార్త‌ల నుంచి క‌నుమ‌రుగు కాక‌ముందే ఈసారి ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై దాడికి తెగ‌బ‌డ్డారు తెలుగుదేశం మ‌నుషులు. గాయపడిన ఎమ్మెల్యే రాజా స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఇసుక తరలిస్తున్నామని అబ‌ద్దాలు చెబుతూ తమపై ఎమ్మెల్యే దాడిశెట్టే దాడి చేశారంటూ, ప్రత్యర్థి వర్గానికి చెందిన మహిళ […]

అక్ర‌మాన్ని అడ్డుకున్న వైకాపా ఎమ్మెల్యేపై దాడి!
X

ఇసుక అక్ర‌మ ర‌వాణ చేస్తున్న ఎమ్మెల్యేను, ఆయ‌న వ‌ర్గీయుల‌ను అడ్డుకున్నందుకు ముసునూరు తాహ‌సిల్దారుపై దాడి జ‌రిపిన కేసు ఇంకా వార్త‌ల నుంచి క‌నుమ‌రుగు కాక‌ముందే ఈసారి ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై దాడికి తెగ‌బ‌డ్డారు తెలుగుదేశం మ‌నుషులు. గాయపడిన ఎమ్మెల్యే రాజా స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఇసుక తరలిస్తున్నామని అబ‌ద్దాలు చెబుతూ తమపై ఎమ్మెల్యే దాడిశెట్టే దాడి చేశారంటూ, ప్రత్యర్థి వర్గానికి చెందిన మహిళ సహా మరో వ్యక్తి ఆస్పత్రిలో చేరడం గమనార్హం. బొద్దవరానికి చెందిన మళ్ళ సత్యనారాయణకు తాండవ న‌ది స‌మీపంలో వ్యవసాయ భూమి ఉంది. చింతంనీడి అబ్బాయి, బర్ల గోవిదం, పలకా సోమరాజు, పినపోతుల నూకరాజుల బృందం ఇర‌వై ట్రాక్టర్లు, మూడు ప్రొక్లెయినర్ల సాయంతో ఆదివారం ఆ భూమి నుంచి ఇసుకను తరలించేందుకు ఉపక్రమించారు. భూమి యజమాని మళ్ళ సత్యనారాయణ అక్కడకు చేరుకుని త‌న భూమిలో ఇసుక అక్ర‌మ త‌వ్వ‌కాల‌ను చేస్తున్న అక్రమార్కులను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా అతనిపై దాడికి దిగారు. విషయం తెలుసుకుని సంఘటనా ప్రాంతానికి చేరుకున్న వైకాపా ఎమ్మెల్యే దాడిశెట్టి ఎందుకు దాడి చేస్తున్నార‌ని అడిగినందుకు ఆయ‌న‌పైనా దాడి జరిపారు. ఇర‌వై మంది వ్యక్తులు తనపై దాడి చేసినట్టు ఎమ్మెల్యే చెబుతున్నారు. అయితే, అక్రమార్కులపై చర్యలు తీసుకోకుండా తుని పట్టణ సిఐ అప్పారావు ఇసుక మాఫియాను అక్కడి నుంచి పంపించేశారని ఎమ్మెల్యే దాడిశెట్టి ఆరోపించారు. ఇదిలావుండ‌గా తాండవ నది ఒడ్డున తమపై ఎమ్మెల్యే దాడిశెట్టే దాడి చేశారని ఇసుక మాఫియా పోలీస్ స్టేష‌న్‌లో ఎదురు కేసు పెట్ట‌డం గ‌మ‌నించాల్సిన అంశం.
వైకాపా నేత‌ల ఖండ‌న‌
అవినీతిని, దౌర్జ‌న్యాల‌ను జోడెద్దుల మాదిరిగా తెలుగుదేశం ప్ర‌భుత్వం నడిపిస్తోంద‌ని వైకాపా ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు అన్నారు. అవినీతిని అడ్డుకుని, అక్ర‌మార్కుల‌ను నిల‌దీసినందుకు తుని ఎమ్మెల్యే దాడిశెట్టిపై దాడి చేయ‌డం ఎంత‌వ‌ర‌క సమంజ‌స‌మ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ సంఘ‌ట‌న ఇసుక మాఫియా వికృత చేష్ట‌ల‌కు ప‌రాకాష్ట అని ఆయ‌న అన్నారు. ఇదే విష‌య‌మై వైకాపా మ‌రో నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ అవినీతిని పెంచి పోషిస్తున్న నాయ‌కులకు ప్ర‌జ‌లెన్నుకున్న నాయ‌కులు సైతం క‌న‌ప‌డ‌డం లేద‌ని అన్నారు. దాడిశెట్టిపై దాడి చేయ‌డం, పైగా ఆయ‌న మీదే కేసు పెట్ట‌డం చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం దౌర్జ‌న్యాల‌కు లైసెన్స్ ఇచ్చిన‌ట్టు క‌నిపిస్తోంద‌ని విమ‌ర్శించారు.

First Published:  13 July 2015 10:51 AM GMT
Next Story