Telugu Global
Others

త‌గ్గిపోతున్న రైలు ప్ర‌యాణికులు

రైలు ప్ర‌యాణికులు క్ర‌మంగా త‌గ్గిపోతున్నారు. ఈ విష‌య‌మై రైల్వే అధికారులు కూడా ఆందోళ‌న చేస్తున్నారు. గ‌త‌ ఆర్థిక సంవ‌త్స‌రం కంటే ఈ సంవ‌త్స‌రం రైళ్ల‌లో ప్ర‌యాణించిన వారి సంఖ్య 8.6 శాతం  త‌గ్గిన‌ట్లు గ‌ణాంకాలు తెలిపాయ‌ని రైల్వే శాఖ ఉన్న‌తాధికారి వెల్ల‌డించారు.  ఇప్ప‌టికే స‌రుకు ర‌వాణా త‌గ్గి ఆర్థికంగా న‌ష్ట పోతున్న రైల్వేశౄఖ  ప్ర‌యాణీకుల సంఖ్య కూడా త‌గ్గుముఖం ప‌ట్ట‌డం  ఆందోళ‌న క‌లిగించే విష‌య‌మ‌ని,  టికెట్ లేకుండా ప్ర‌యాణించే వారి సంఖ్య పెర‌గ‌డంతో పాటు, రోడ్డు మార్గాలు […]

త‌గ్గిపోతున్న రైలు ప్ర‌యాణికులు
X
రైలు ప్ర‌యాణికులు క్ర‌మంగా త‌గ్గిపోతున్నారు. ఈ విష‌య‌మై రైల్వే అధికారులు కూడా ఆందోళ‌న చేస్తున్నారు. గ‌త‌ ఆర్థిక సంవ‌త్స‌రం కంటే ఈ సంవ‌త్స‌రం రైళ్ల‌లో ప్ర‌యాణించిన వారి సంఖ్య 8.6 శాతం త‌గ్గిన‌ట్లు గ‌ణాంకాలు తెలిపాయ‌ని రైల్వే శాఖ ఉన్న‌తాధికారి వెల్ల‌డించారు. ఇప్ప‌టికే స‌రుకు ర‌వాణా త‌గ్గి ఆర్థికంగా న‌ష్ట పోతున్న రైల్వేశౄఖ ప్ర‌యాణీకుల సంఖ్య కూడా త‌గ్గుముఖం ప‌ట్ట‌డం ఆందోళ‌న క‌లిగించే విష‌య‌మ‌ని, టికెట్ లేకుండా ప్ర‌యాణించే వారి సంఖ్య పెర‌గ‌డంతో పాటు, రోడ్డు మార్గాలు మెరుగుప‌డ‌డంతో బ‌స్సులు, కార్ల‌లో ప్ర‌యాణిస్తున్న వారి సంఖ్య ఎక్కువైంద‌ని ఆయ‌న అన్నారు.గ‌త ఏడాది మొద‌టి మూడు నెల‌ల్లో 2,235.69 మిలియ‌న్ల ప్ర‌యాణీకులు ప్ర‌యాణిస్తే, ఈ ఏడాది తొలి మూడు నెల‌ల్లో 2,042.04 మిలియ‌న్ల మంది మాత్ర‌మే ప్ర‌యాణించారు. ఇది 8.6 శాతం త‌గ్గుద‌ల‌. స‌బ‌ర్బ‌న్ రైళ్ల‌లో ఈ త‌గ్గుద‌ల 11.69గా న‌మోదైందని ఆయ‌న తెలిపారు.
అయితే దీనికి కార‌ణాల‌ను ప‌రిశీలించిన‌ప్పుడు సాధార‌ణ ప్ర‌యాణికులకు ఎక్కువ‌సార్లు టికెట్లు అందుబాటులో ఉండ‌డం లేదు. పైగా ద‌ళారీలు టికెట్ల‌న్నీ ముందుగానే రిజ‌ర్వు చేసుకుని బ్లాక్‌లో అమ్ముకుంటున్నారు. దీంతో అస‌లైన ప్ర‌యాణికులకు అన్యాయం జ‌రుగుతోంది. ఒక‌వేళ ద‌ళారీల నుంచి టికెట్లు కొనుగోలు చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డితే క‌నీసం యాభై శాతం క‌న్నా ఎక్కువ‌గా టికెట్ ధ‌ర‌పై అద‌న‌పు ఛార్జీ ఉంటుంది. పైగా స్టేష‌న్ల‌కెళ్ళి రైలు ఎక్కాల్సిన ప‌రిస్థితి. ఇక బ‌స్సుల్లో అయితే అందుబాటులో ఉన్న ప్రాంతానికి వెళ్ళి టికెట్ తీసుకుని హాయిగా వెళ్ళిపోవ‌చ్చ‌న్న అభిప్రాయం ఉంది. పైగా లావాదేవీల వ్య‌వ‌హార‌మంతా త‌మ‌కు అందుబాటులో ఉంటుంది. రిజ‌ర్వేష‌న్ సౌక‌ర్యం ఆన్‌లైన్‌లో వ‌చ్చిన త‌ర్వాత రైలు క‌న్నా బ‌స్సుల‌కు రిజ‌ర్వేష‌న్ చేసుకోవ‌డం చాలా ఈజీగా ఫీల‌వుతున్నారు. పైగా కాన్సిల్ చేసుకోవ‌ల‌సిన ప‌రిస్థితుల్లో కూడా ప్ర‌యాణికుల‌కు బ‌స్సు అధికారుల‌తో నేరుగా మాట్టాడుకోవ‌డం, త‌దుప‌రి నిర్ణ‌యాలు తీసుకోవ‌డం సౌక‌ర్యంగా ఉంటుంద‌న్న భావ‌నతో రైలు క‌న్నా బ‌స్సుల‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నారు. ఇంకొక విష‌యం ఏమిటంటే… ఎక్కువ మంది ఫోర్ వీల‌ర్‌ల‌ను ఇష్ట‌ప‌డుతున్నారు. ఇవి బ‌స్సులు, రైళ్ళు క‌న్నా మ‌రింత సౌక‌ర్యంగా ఉండ‌డం, కావాల్సిన చోట కావాల్సినంత స‌మ‌యం త‌మ‌కు అనువుగా మ‌లుచుకోవ‌డంతో వీటికి కూడా ప్రాధాన్య‌త పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌థ‌మ ప్రాధాన్య‌త ఫోర్ వీల‌ర్‌లు ఆక్ర‌మిస్తుండ‌గా రెండో ప్రాధాన్య‌త బ‌స్సుల‌కు పోతోంది. ఇక రైళ్ళ ప్ర‌యాణ‌మ‌నేది ఆఖ‌రి ప్రాధాన్య‌తా అంశంగా మిగిలిపోతోంది. సో… రైలుకు ప్ర‌యాణికులు త‌గ్గిపోవ‌డానికి కార‌ణం ఇదే…
First Published:  13 July 2015 12:03 AM GMT
Next Story