Telugu Global
Cinema & Entertainment

 వీరప్పన్ ట్రయిలర్ సూపర్ హిట్

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఎలా ఉన్నప్పటికీ ట్రయిలర్స్ మాత్రం అదిరిపోతాయి. ట్రయిలర్ కట్టింగ్ ను దగ్గరుండి పర్యవేక్షించే వర్మ, ఆ విషయంలో మాత్రం ప్రతిసారి నూటికి నూరు మార్కులు తెచ్చుకుంటున్నాడు. తాజాగా ఈ దర్శకుడు వీరప్పన సినిమా ట్రయిలర్ ను విడుదల చేశాడు. విడుదలచేసిన కొద్ది నిమిషాలకే ఇనిస్టెంట్ గా హిట్టయింది. కిల్లింగ్ వీరప్పన్ పేరుతో తెలుగు-తమిళ-కన్నడ భాషల్లో ఓ సినిమాను రూపొందిస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమా షూటింగ్ ఇంకా పోస్ట్ […]

 వీరప్పన్ ట్రయిలర్ సూపర్ హిట్
X
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఎలా ఉన్నప్పటికీ ట్రయిలర్స్ మాత్రం అదిరిపోతాయి. ట్రయిలర్ కట్టింగ్ ను దగ్గరుండి పర్యవేక్షించే వర్మ, ఆ విషయంలో మాత్రం ప్రతిసారి నూటికి నూరు మార్కులు తెచ్చుకుంటున్నాడు. తాజాగా ఈ దర్శకుడు వీరప్పన సినిమా ట్రయిలర్ ను విడుదల చేశాడు. విడుదలచేసిన కొద్ది నిమిషాలకే ఇనిస్టెంట్ గా హిట్టయింది. కిల్లింగ్ వీరప్పన్ పేరుతో తెలుగు-తమిళ-కన్నడ భాషల్లో ఓ సినిమాను రూపొందిస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమా షూటింగ్ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ లోగా సినిమా ట్రయిలర్ ను విడుదల చేసి సంచలనం సృష్టించాడు. గతంలో వీరప్పన్ పాత్రధారి అయిన సందీప్ భరధ్వాజ్ ఫొటోను విడుదల చేసి సెన్సేషన్ సృష్టించాడు వర్మ. సందీప్ అచ్చం వీరప్పన్ లా కనిపించేసారికి అంతా షాకయ్యారు. అప్పట్నుంచి ట్రయిలర్ ఎప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ ఇంట్రెస్టే ఇప్పుడు ట్రయిలర్ ను సూపర్ హిట్ చేసింది. తెలుగు, తమిళ, కన్నడ ప్రేక్షకులందరికీ వీరప్పన్ తెలిసిన పాత్రే కావడంతో ఒకేసారి 3 భాషల్లో తెరకెక్కిస్తున్నాడు వర్మ. త్వరలోనే హిందీ ట్రయిలర్ కూడా విడుదల చేస్తానని మాటిచ్చాడు. కనీసం కిల్లింగ్ వీరప్పన్ తో నైనా వర్మ తన పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటాడేమో ఆశిద్దాం.
First Published:  12 July 2015 8:00 PM GMT
Next Story