Telugu Global
Cinema & Entertainment

బాలీవుడ్ బాక్సాఫీస్ క‌లెక్ష‌న్ క్వీన్  దీపిక కాదా..?

దీపిక ప‌దుకోణ్.. గ‌త రెండు యేళ్ల‌లో బాలీవుడ్ నెంబ‌ర్ వ‌న్  హీరోయిన్ గా ఎదిగిన  గ్లామ‌ర్ క్వీన్. చెన్నై ఎక్స్ ప్రెస్..యే జ‌వానీ హై దీవానీ, రామ్ లీలా, పీకూ  వంటి చిత్రాలు దీపిక ప‌దుకోణ్ ను గ్లామ‌ర్ న‌టిగానే కాకుండా.. యాక్టింగ్  టాలెంట్ వున్న హీరోయిన్ గా నిరూపించాయి. షారుక్ ఖాన్ తో చేసిన చెన్నై ఎక్స్ ప్రెస్ బాక్సాఫీస్ రికార్డు  క‌లెక్ష‌న్లు వ‌సూలు చేసింది. త‌న ప్రియుడు ర‌ణ్వీర్ సింగ్ తో చేసిన రామ్ […]

బాలీవుడ్ బాక్సాఫీస్ క‌లెక్ష‌న్ క్వీన్  దీపిక కాదా..?
X

దీపిక ప‌దుకోణ్.. గ‌త రెండు యేళ్ల‌లో బాలీవుడ్ నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ గా ఎదిగిన గ్లామ‌ర్ క్వీన్. చెన్నై ఎక్స్ ప్రెస్..యే జ‌వానీ హై దీవానీ, రామ్ లీలా, పీకూ వంటి చిత్రాలు దీపిక ప‌దుకోణ్ ను గ్లామ‌ర్ న‌టిగానే కాకుండా.. యాక్టింగ్ టాలెంట్ వున్న హీరోయిన్ గా నిరూపించాయి. షారుక్ ఖాన్ తో చేసిన చెన్నై ఎక్స్ ప్రెస్ బాక్సాఫీస్ రికార్డు క‌లెక్ష‌న్లు వ‌సూలు చేసింది. త‌న ప్రియుడు ర‌ణ్వీర్ సింగ్ తో చేసిన రామ్ లీలా చిత్రం దీపిక అందానికి ప్ర‌పంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ పెరిగారు. సాధార‌ణంగా దీపిక ట్రాక్ రికార్డ్ ను తెలిసిన వారు.. బాలీవుడ్ టాక్ ఎర్నింగ్ హీరోయిన్ ఈ ముద్దుగుమ్మే అనుకుంటారు.

క‌ట్ చేస్తే.. క్వీన్ చిత్రంతో త‌న మార్కెట్ గ్రాఫ్ ను పెంచుకున్న హ‌ర్యానా బ్యూటీ కంగ‌న రనావ‌త్ బాలీవుడ్ టాప్ ఎర్నింగ్ క్వీన్ అని తేల్చారు. త‌ను వెడ్స్ మ‌ను రిట‌ర్న్ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ యాక్టింగ్ కు విమ‌ర్శ‌కులు సైతం ఫిదా అయ్యారు. దీంతో ఈ హీరోయిన్ కు మార్కెట్ వాల్యూ బాగా పెరిగింది. దీపిక ప‌దుకోణ్ కంటే నెంబ‌ర్ వ‌న్ ఎర్న‌ర్ కంగ‌నా అని తేల్చారు. త‌రువాత లిస్ట్ అనుష్క శ‌ర్మ‌,శ్ర‌ద్దా క‌పూర్..లు నాలుగు రాళ్లు సంపాదించుకున్న హీరోయిన్స్ లిస్ట్ లో వున్నార‌టండి.! మొత్తం మీద హాట్ బ్యూటీస్ దే హ‌వా అని క్లియ‌ర్ గా తెలుస్తుంది క‌దా..!

First Published:  14 July 2015 5:01 AM GMT
Next Story