Telugu Global
Others

బాదంతో బ‌హుళ ప్ర‌యోజ‌నాలు!

డ్రై ఫ్రూట్స్‌లో బాదంప‌ప్పుకు విశిష్ట‌స్థానం ఉంది.  బాదం మంచి పోషకాహారం.  ఇందులో ఇనుము రాగి ఫాస్పరస్‌ వంటి ధాతువులు, విటమిన్‌ ‘బి’ లు  ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల మ‌న శ‌రీరానికి అధిక శక్తి లభిస్తుంది. రక్తకణాలు, హీమోగ్లోబిన్ ఉత్ప‌త్తికి బాదం చ‌క్క‌గా ఉప‌క‌రిస్తుంది. గుండె, మెదడు, నాడులు, ఎముకలు, కాలేయం సక్రమంగా పనిచేయడానికి బాదం ఎంతగానో తోడ్పడుతుంది. కండరాలు దృఢంగా మార‌డానికి బాదం ఎంతగానో తోడ్పడుతుంది. బాదం  పేస్ట్ రోజూ కొద్దిగా నెత్తికి రాసుకుంటే జుట్టు […]

బాదంతో బ‌హుళ ప్ర‌యోజ‌నాలు!
X
డ్రై ఫ్రూట్స్‌లో బాదంప‌ప్పుకు విశిష్ట‌స్థానం ఉంది. బాదం మంచి పోషకాహారం. ఇందులో ఇనుము రాగి ఫాస్పరస్‌ వంటి ధాతువులు, విటమిన్‌ ‘బి’ లు ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల మ‌న శ‌రీరానికి అధిక శక్తి లభిస్తుంది. రక్తకణాలు, హీమోగ్లోబిన్ ఉత్ప‌త్తికి బాదం చ‌క్క‌గా ఉప‌క‌రిస్తుంది. గుండె, మెదడు, నాడులు, ఎముకలు, కాలేయం సక్రమంగా పనిచేయడానికి బాదం ఎంతగానో తోడ్పడుతుంది. కండరాలు దృఢంగా మార‌డానికి బాదం ఎంతగానో తోడ్పడుతుంది. బాదం పేస్ట్ రోజూ కొద్దిగా నెత్తికి రాసుకుంటే జుట్టు రాలడం తగ్గిపోతుంది. చుండ్రు, వెంట్రుకలు ఊడటం వంటి వాటికి చక్కటి పరిష్కారం. ఎగ్జిమా వంటి చర్మ వ్యాధులకు అడవి బాదంపప్పు చాలా బాగా పనిచేస్తుంది. బాదం ఆకులను తీసుకొని వాటిని చూర్ణం చేసి, నీటిలో పేస్ట్‌లాగా కలిపి ఎగ్జిమా ఉన్న ప్రాంతాల్లో రాస్తే సత్వర ఫలితం కనబడుతుంది. బాదం పేస్ట్‌తో, పాలను కలిపి రోజూ ముఖానికి రాసుకుంటే ముఖం కాంతి వంతంగా ఉంటుంది. బాదం పాలు ఎంతో శ్రేష్ఠమైనవి. మామూలుగా మనం తీసుకునే పాలతో పోలిస్తే ఇవి ఎంతో ఉత్తమమైనవి అని చెప్పవచ్చు. ఆవుపాలు తాగడానికి ఇష్టపడని పిల్లలకు బాదం పాలు పట్టవచ్చు.
First Published:  13 July 2015 8:01 PM GMT
Next Story