Telugu Global
Others

ఎం.ఎస్.విశ్వనాథన్‌ కన్నుమూత

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎస్‌. విశ్వనాథన్‌ కన్నుమూశారు. ఈయన వయసు 85 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విశ్వనాథన్‌ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1928వ సంవత్సరం జూన్‌ 24న కేరళలోని పాలక్కాడ్‌ సమీపంలోని ఇలప్పులలో జన్మించారు. 13 ఏళ్ల వయసులోనే సంగీతంలో మెళకువలు నేర్చుకున్నారు. సీఆర్‌ సుబ్బరామన్‌తో కలిసి దేవదాసు, లైలామజ్నూ చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన […]

ఎం.ఎస్.విశ్వనాథన్‌ కన్నుమూత
X

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎస్‌. విశ్వనాథన్‌ కన్నుమూశారు. ఈయన వయసు 85 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విశ్వనాథన్‌ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1928వ సంవత్సరం జూన్‌ 24న కేరళలోని పాలక్కాడ్‌ సమీపంలోని ఇలప్పులలో జన్మించారు. 13 ఏళ్ల వయసులోనే సంగీతంలో మెళకువలు నేర్చుకున్నారు. సీఆర్‌ సుబ్బరామన్‌తో కలిసి దేవదాసు, లైలామజ్నూ చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన దేవదాసు చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమాలోని జగమే మాయ బతుకే మాయ పాటను స్వరపర్చారు. చండీరాణి, సిపాయి చిన్నయ్య తదితర చిత్రాలకు సంగీతాన్ని అందించారు. గుప్పెడు మనస్సు, సంబరాల రాంబాబు, లేత మనసులు, అంతులేని కథ, ఆకలి రాజ్యం వంటి సూపర్‌హిట్‌ సినిమాలకు ఆయన సంగీతం సమకూర్చారు. 1200పైగా తెలుగు, తమిళ చిత్రాలకు ఆయన సంగీతాన్ని అందించారు.
నాలుగేళ్ళ వ‌యస్సులోనే ఆయ‌న తండ్రి మ‌న‌యంగ‌థ్ సుబ్ర‌మ‌ణియ‌న్ నారాయ‌ణ్‌కుట్టి చ‌నిపోయారు. పేద‌రికంతో అల్లాడుతున్న కుటుంబాన్ని నెట్టుకురావ‌డం త‌న‌వ‌ల్ల కాక ఆక‌లి బాధ‌ను త‌ట్టుకోలేక తన‌తోపాటు విశ్వ‌నాథ‌న్‌ని కూడా చంపేయాల‌ని ఆయ‌న త‌ల్లి భావించారు. అయితే అమ్మ‌మ్మ విశ్వ‌నాథ‌న్ సాకింది. ఆరేళ్ళ వ‌య‌స్సులో విశ్వ‌నాథ‌న్ సినిమా థియేట‌ర్ల ద‌గ్గ‌ర చిరుతిళ్ళు అమ్ముకుని కుటుంబానికి ఆస‌రాగా నిలిచారు. ఆరేళ్ళ వ‌య‌స్సులో ఆయ‌న‌కు దొరికిన గురువు నీల‌కంద భాగ‌వ‌తార్. ఆయ‌న ద‌గ్గ‌రే 1933-39 మ‌ధ్య సంగీతాన్ని నేర్చుకున్నారు. ఇలా నేర్చుకున్న సంగీత విద్య‌తో ఆయ‌న ప‌ద‌మూడేళ్ళ వ‌య‌స్సులో మొద‌టిసారిగా త్రివేండ్రంలో సంగీత క‌చేరీ చేసి అంద‌రినీ సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురి చేశారు. తెలుగులోను, త‌మిళంలోను, మ‌ళ‌యాలంలోను విశ్వ‌నాథ‌న్ అనేక చిత్రాల‌కు సంగీతం స‌మ‌కూర్చారు.
విశ్వ‌నాథ‌న్ గాయ‌కుడిగా, న‌టుడిగా స్థిర‌ప‌డాల‌ని చాలా ప్ర‌య‌త్నం చేశారు. అయితే ఆయ‌న ఆశ ఫ‌లించ‌లేదు. 40వ ద‌శ‌కంలో ఆయ‌న వీధి నాటకాల్లో మాత్రం చిన్న‌చిన్న వేషాలేశారు. 2001 నుంచి ఆయనకు అవార్డుల పంట పండింది. 2001లో తొలిసారిగా దక్షిణాది ఫిలింఫేర్‌ లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డు సాధించారు. కలైమామణి, అమెరికాలో వరల్డ్‌ ఫెస్ట్, కముకుర, సత్యభామ యూనివర్శిటీ నుంచి డాక్టరేట్‌… ఇలా మొత్తం ఆయన 16 అవార్డులు, రివార్డులు దక్కించుకున్నారు. తమిళనాడు, కేరళ ప్రభుత్వాల నుంచి ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డులు కూడా దక్కించుకున్నారు. విశ్వనాథన్‌ మృతి వార్త విని సినీ ప్రపంచం దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది.

First Published:  13 July 2015 8:55 PM GMT
Next Story