Telugu Global
Cinema & Entertainment

బాహుబ‌లి కి  స‌ల్మాన్ దెబ్బ‌..!

బాలీవుడ్ లో  క‌లెక్ష‌న్ల ప‌రంగా సంచ‌ల‌నం చేసిన బాహుబ‌లి .. శుక్ర‌వారం నుంచి  స‌ల్మాన్ ఖాన్ ఎటాక్ ను ఎదుర్కొవ‌డానికి సిద్దంగా ఉండాలంటున్నారు. ఎందుకంటే  స‌ల్మాన్ ఖాన్..క‌రీనా క‌పూర్ లీడ్ రోల్స్ లో  ద‌ర్శ‌కుడు క‌బీర్ ఖాన్  భ‌జ‌రంగ్ బాయిజాన్ అనే చిత్రం చేశారు. ఈ వారంలో  ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌కు సిద్దం అయ్యింది. ఈ మ‌ధ్య ఏవో కొన్ని  కేసులు ఈ చిత్రంపై వ‌చ్చాయి. వాటిన్నింటిని ప‌రిష్క‌రించుకుని  స‌ల్మాన్ ఖాన్  చిత్రం రంగంలోకి […]

బాహుబ‌లి కి  స‌ల్మాన్ దెబ్బ‌..!
X

బాలీవుడ్ లో క‌లెక్ష‌న్ల ప‌రంగా సంచ‌ల‌నం చేసిన బాహుబ‌లి .. శుక్ర‌వారం నుంచి స‌ల్మాన్ ఖాన్ ఎటాక్ ను ఎదుర్కొవ‌డానికి సిద్దంగా ఉండాలంటున్నారు. ఎందుకంటే స‌ల్మాన్ ఖాన్..క‌రీనా క‌పూర్ లీడ్ రోల్స్ లో ద‌ర్శ‌కుడు క‌బీర్ ఖాన్ భ‌జ‌రంగ్ బాయిజాన్ అనే చిత్రం చేశారు. ఈ వారంలో ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌కు సిద్దం అయ్యింది. ఈ మ‌ధ్య ఏవో కొన్ని కేసులు ఈ చిత్రంపై వ‌చ్చాయి. వాటిన్నింటిని ప‌రిష్క‌రించుకుని స‌ల్మాన్ ఖాన్ చిత్రం రంగంలోకి దిగుతుంది.

దీంతో గ‌త శుక్ర‌వారం హింది వెర్ష‌న్ లో బాహుబ‌లి రిలీజ్ అయ్యింది. ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ఈ సినిమాను బాలీవుడ్ లో ప్ర‌జెంట్ చేశారు. ప్ర‌చారం ఒక రేంజ్ లో ఉండ‌టంతో.. అక్క‌డ కూడా సినిమాకు క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిసింది. అయితే ఈ జోరు స‌ల్మాన్ ఖాన్ చిత్రం విడుదలైన త‌రువాత బాగా త‌గ్గిపోయో అవ‌కాశం ఉంద‌నే టాక్ విమ‌ర్శ‌కులు నుంచి వినిపిస్తుంది. ఒక వేళ్ల స‌ల్మాన్ ఖాన్ చిత్రం యావ‌రేజ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం.. బాహుబ‌లి కు పెద్ద‌గా ఎఫెక్ట్ ఉండ‌క పోవ‌చ్చు అనే మ‌రో టాక్ కూడా ట్రేడ్ ఎక్ట్స్ ప‌ర్ట్ నుంచి వినిపిస్తుంది. ఫైన‌ల్ గా స‌ల్మాన్ బాహుబ‌లి ని ఏ రేంజ్ లో దెబ్బ కొడ‌తాడో తెలియాలంటే.. శుక్ర‌వారం వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

First Published:  14 July 2015 6:22 AM GMT
Next Story