Telugu Global
Others

ఏం తింటే.... జుట్టు పెరుగుతుంది?

మనిషి అందంలో జుట్టుకున్న ప్రాధాన్యత ఏంతనేది   కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే జట్టు ఊడుతుంటే దిగులు పడని మనిషంటూ ఉండడు. ఇది మహిళలకు మరింతగా వర్తిస్తుంది.  జుట్టు ఆరోగ్యం కోసం కుదుళ్ల‌కు పట్టించే  పైపూతలు చాలార‌కాలు వాడుతుంటాం కానీ అన్నింటికంటే ముందు ఆహారం విషయంలో తగిన మార్పులు చేసుకోవాలి. జుట్టుకి ఆరోగ్యాన్నిచ్చే ఆహారం గురించి చెప్పాలంటే…. డి విటమిన్ లోపంతో కురుల‌కు హాని కలుగుతుందని పరిశోధనల్లో తేలింది. జుట్టు ఊడుతున్న వారిలో ఈ లోపం ఏకంగా 121 శాతం ఉన్నట్టుగా ఆ […]

ఏం తింటే.... జుట్టు పెరుగుతుంది?
X

మనిషి అందంలో జుట్టుకున్న ప్రాధాన్యత ఏంతనేది కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే జట్టు ఊడుతుంటే దిగులు పడని మనిషంటూ ఉండడు. ఇది మహిళలకు మరింతగా వర్తిస్తుంది. జుట్టు ఆరోగ్యం కోసం కుదుళ్ల‌కు పట్టించే పైపూతలు చాలార‌కాలు వాడుతుంటాం కానీ అన్నింటికంటే ముందు ఆహారం విషయంలో తగిన మార్పులు చేసుకోవాలి. జుట్టుకి ఆరోగ్యాన్నిచ్చే ఆహారం గురించి చెప్పాలంటే….

  • డి విటమిన్ లోపంతో కురుల‌కు హాని కలుగుతుందని పరిశోధనల్లో తేలింది. జుట్టు ఊడుతున్న వారిలో ఈ లోపం ఏకంగా 121 శాతం ఉన్నట్టుగా ఆ పరిశోధనలు చెబుతున్నాయి. విటమిన్ డి ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యనుండి బయటపడవచ్చు.
  • జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారం ద్వారా కూడా మనకు ప్రొటీన్లు అందుతాయి. ప్రొటీన్లు తక్కువ ఉన్న ఆహారం తీసుకుంటున్నపుడు మన శరీరం జుట్టు పెరుగుదలను ఆపేస్తుంది. దాంతో కొత్త జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడటంతో హెయిర్ లాస్ భారీగా ఉంటుంది. తిరిగి ప్రొటీన్లు ఉన్న ఆహారం తీసుకుంటే ఈ సమస్య తీరుతుంది. మహిళలకు జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే 46గ్రాముల ప్రొటీన్లు అవసరం. వీటికోసం చికెన్, గుడ్లు, బాదం పప్పు లాంటి ఆహారాన్ని రోజువారీ ఫుడ్ లో చేర్చుకోవాలి.
  • ఆరోగ్యకరమైన కొవ్వులు ఒమేగా 3, 6 ఫ్యాటీ ఆసిడ్లు, విటమిన్ ఇ, సి ఉన్న ఆహారం, శరీరంలోని విషపదార్థాలను తొలగించే యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న పళ్లు, తాజా కూరగాయలవంటి వాటిని తినేవారికి మిగిలిన వారికంటే జుట్టు మందంగా పెరగడం గమనించారు. పోషకాహార లోపం ఉన్నవారిలోనూ, అనారోగ్యాలకు గురయినపుడూ మహిళల్లో జుట్టు ఎక్కువగా ఊడుతుందని కూడా నిపుణులు చెబుతున్నారు.
  • శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా లోపమున్నా జుట్టు ఊడుతుంది. అది పూడాలంటే ప్రొబయాటిక్ అంటే మనకు మేలు చేసే బ్యాక్టీరియా ఉన్న పెరుగు, మజ్జిగ లాంటివి ఎక్కువ‌గా తీసుకోవాలి.
  • ఇక ఈ సమస్య నుండి త్వరగా బయటపడాలంటే ఐ రన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాల్సిందే. 19 నుండి 50 సంవత్సరాల లోపు వయసున్న మహిళలకు రోజుకి 18మిల్లీగ్రాములు, ఆ పై వయసున్న వారికి ఎనిమిది మిల్లీగ్రాముల ఐరన్ అవసరం అవుతుంది. జుట్టు ఎక్కువగా ఊడుతున్న మహిళల్లో ఇతరులకంటే 45శాతం ఇనుము తక్కువగా ఉన్నట్టుగా కూడా పరిశోధకులు గుర్తించారు. శాకాహారం కంటే మాంసాహారం నుండి మన శరీరం ఇనుముని ఎక్కువగా తీసు.కుంటుంది. అందుకే మాంసాహారులకంటే శాకాహారులు ఐరన్ ఉన్న ఆహారం రెట్టింపు తీసుకోవచ్చు. బీన్స్, సోయా బీన్స్, పప్పు ధాన్యాలు వంటి వాటి ద్వారా శాకాహారులు ఐరన్ ఎక్కువగా పొందే అవకాశం ఉంది.

First Published:  15 July 2015 12:06 AM GMT
Next Story