Telugu Global
Cinema & Entertainment

సిద్ధార్థ్ కోసం సమంత సిఫార్స్

సమంత-సిద్ధార్థ్ మధ్య ప్రేమాయణం ఇప్పుడు కొనసాగుతుందా లేదా అనేది పాత విషయం. దానికంటే తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేవలం సమంత రికమండేషన్ వల్లనే తమిళనాట సిద్ధూకు ఓ ఆఫర్ వచ్చిందనే ప్రచారం ఇప్పుడు కోలీవుడ్ లో ఆ నోటా ఈ నోటా పాకి చివరికి టాలీవుడ్ వరకు చేరింది. సూపర్ హిట్టయిన అరమణయ్ సినిమాకు సీక్వెల్ తీసే పనిలో పడ్డాడు దర్శకుడు సి.సుందర్. ఈ సినిమా సీక్వెలో […]

సిద్ధార్థ్ కోసం సమంత సిఫార్స్
X
సమంత-సిద్ధార్థ్ మధ్య ప్రేమాయణం ఇప్పుడు కొనసాగుతుందా లేదా అనేది పాత విషయం. దానికంటే తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేవలం సమంత రికమండేషన్ వల్లనే తమిళనాట సిద్ధూకు ఓ ఆఫర్ వచ్చిందనే ప్రచారం ఇప్పుడు కోలీవుడ్ లో ఆ నోటా ఈ నోటా పాకి చివరికి టాలీవుడ్ వరకు చేరింది. సూపర్ హిట్టయిన అరమణయ్ సినిమాకు సీక్వెల్ తీసే పనిలో పడ్డాడు దర్శకుడు సి.సుందర్. ఈ సినిమా సీక్వెలో లీడ్ రోల్ కోసం త్రిషను తీసుకున్నాడు. ఇదే మూవీలో త్రిష సరసన సిద్దార్థ్ హీరోగా నటించే అవకాశం అందుకున్నాడు. ఈ ఆఫర్ కేవలం సమంత వల్లనే వచ్చిందంటున్నారు చాలామంది. ఈమధ్య కాలంలో సరైన సక్సెస్ లేక ఇబ్బందిపడుతున్న సిద్ధార్థ్ కోసం సమంత స్వయంగా తనే రంగంలోకి దిగి సుందర్ తో చర్చలు జరిపి ఒప్పించిందంటున్నారు. ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ.. త్రిష ఈ విషయాన్ని చూచాయగా చెప్పుకొచ్చింది. గతంలో త్రిష-సిద్ధూ కాంబినేషన్ లో తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా వచ్చి ఘనవిజయం సాధించింది. తాజా చిత్రం కూడా తెలుగులోకి డబ్ అవ్వడం గ్యారెంటీ. మరి అప్పటి క్రేజ్ ఇప్పుడు వర్కవుట్ అవుతుందా అనేది చూడాలి. లేదంటే.. తెలుగు వెర్షన్ కు సమంత ప్రమోషన్ కూడా ఇస్తుందేమో చూడాలి.
First Published:  15 July 2015 5:15 AM GMT
Next Story