Telugu Global
Others

ప‌రువు ద‌క్కించుకునేందుకు బాబు తంటాలు!

గోదావరి పుష్కరాల ప్రారంభం రోజున కోల్పోయిన ప్రభుత్వ ప్రతిష్టను కాపాడుకునేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు నానా తంటాలూ పడుతున్నారు. రాజమండ్రి పుష్కర ఘాట్‌లో తొక్కిసలాట నేపథ్యంలో ఘాట్ల వద్ద తిరిగి అలాంటి సంఘటనలు జరగకుండా చూసేందుకు సీనియర్‌ ఐపిఎస్‌ అధికారులను నియ‌మించారు. పుష్కరాల కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం 19 వేల మంది పోలీసులను వినియోగించింది. దీనికి అదనంగా మరో 30 కంపెనీల బలగాలను రాజమండ్రికి రప్పించారు. సంఘటన జరిగిన పుష్కర ఘాట్‌ ఇన్‌ఛార్జిగా నార్త్‌ […]

ప‌రువు ద‌క్కించుకునేందుకు బాబు తంటాలు!
X
గోదావరి పుష్కరాల ప్రారంభం రోజున కోల్పోయిన ప్రభుత్వ ప్రతిష్టను కాపాడుకునేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు నానా తంటాలూ పడుతున్నారు. రాజమండ్రి పుష్కర ఘాట్‌లో తొక్కిసలాట నేపథ్యంలో ఘాట్ల వద్ద తిరిగి అలాంటి సంఘటనలు జరగకుండా చూసేందుకు సీనియర్‌ ఐపిఎస్‌ అధికారులను నియ‌మించారు. పుష్కరాల కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం 19 వేల మంది పోలీసులను వినియోగించింది. దీనికి అదనంగా మరో 30 కంపెనీల బలగాలను రాజమండ్రికి రప్పించారు. సంఘటన జరిగిన పుష్కర ఘాట్‌ ఇన్‌ఛార్జిగా నార్త్‌ కోస్టల్‌ జోన్‌ ఐజి విశ్వజిత్‌ను ప్రభుత్వం నియమించింది. ఆయన ఆధ్వర్యంలో పనిచేసేందుకు 13 మంది ఎఎస్‌పి, డిఎస్‌పి స్థాయి అధికారులను నియమించింది. 29 మంది యాత్రికులు మృతికి కారణంగా ప్రభుత్వం భావిస్తున్న రాజమండ్రి అర్బన్‌ ఎస్‌పి హరికృష్ణకు ఫుడ్‌ అండ్‌ అకామిడేషన్‌ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది. కోటిలింగాల ఘాట్‌కు విజయవాడ సిపి గౌతమ్‌ సవాంగ్‌ను ఇన్‌ఛార్జిగా నియమించింది. ఆయన ఆధ్వర్యంలో పనిచేసేందుకు ఎఎస్‌పి, డిఎస్‌పి స్థాయిగల ఆరుగురు సీనియర్‌ అధికారులను నియమించింది. పద్మావతి, గౌతమి, సరస్వతి, మార్కండేయ, రామపాదాలు, అయ్యప్పస్వామి ఘాట్లకు డిఎస్‌పి స్థాయి అధికారులను ఇన్‌చార్జిలుగా నియమించింది. తరచూ ఘాట్ల వద్దకు ముఖ్య‌మంత్రి తోపాటు మంత్రులు వస్తుండడంతో భారీ కాన్వాయి వల్ల యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం గ్రహించింది. ఇక నుంచి సిఎం కాన్వాయిలో మూడే వాహనాలు ఉండేలా చర్యలు తీసుకుంది. యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంటే కాలినడకనే ఘాట్లకు చేరుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు.
First Published:  15 July 2015 11:36 PM GMT
Next Story