శ్రీ‌లేఖ‌ను చంపా..నేనూ చ‌స్తా!

శ్రీ‌లేఖ‌ను చంపా.. నేనూ చ‌స్తా..( లేఖ‌కో మార్ దియా.. ముజేపే బీ భ‌రోసా న ర‌ఖో!)  ఇదీ హైద‌రాబాద్‌లో అక్కాచెల్లెళ్ల‌ను చంపిన త‌రువాత నిందితుడు అమిత్‌సింగ్ త‌న తండ్రితో ఫోన్‌లో చివ‌రిసారిగా మాట్లాడిన మాట‌లు.. అమిత్‌సింగ్ కోసం ఇప్ప‌టికే నాలుగు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ప్రేమ వ్య‌వ‌హార‌మే ఈ హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని చైత‌న్య‌పురి పోలీసులు నిర్ధ‌రణ‌కు వ‌చ్చారు. కేవ‌లం త‌న‌ను కాద‌న్న‌ద‌న్న అక్క‌సుతో శ్రీ‌లేఖ‌ను అడ్డువ‌చ్చిన ఆమె అక్క‌ను కూడా చంపేసిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో పోలీసులు నిందితుడి తండ్రి అమ‌ర్‌సింగ్‌ను అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నించ‌గా ఈ విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. త‌న కొడుకు త‌ప్పుచేశాడ‌ని పోలీసుల‌తో అమ‌ర్‌సింగ్ అన్నాడు. ఇప్ప‌టికే ఈ విషయంలో అనేక‌సార్లు వాడిని మంద‌లించామ‌ని, వాడు దొరికితే క‌ఠినంగా శిక్షించాల‌ని పోలీసుల‌కు విజ్ఞప్తి చేశాడు. అయితే పోలీసులు అత‌డిని ఎలాగైనా బ‌య‌టికి తీసుకురావాల‌ని అమ‌ర్‌సింగ్‌కు సూచించారు. అమిత్‌సింగ్‌  కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు అమిత్‌సింగ్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. వాటిని పోలీసులు ఇంకా నిర్ధారించాలేదు.