Telugu Global
Others

అనంతలో సౌరవిద్యుత్‌ కేంద్రం

అనంతపురంలో మరో సౌరవిద్యుత్‌ కేంద్రం ఏర్పాటు కానుంది. దీని ఉత్పాదక సామర్థ్యం 500 మెగావాట్లు. జెన్‌కో యాజమాన్యం సొంతంగా ఈ కేంద్రాన్ని నెలకొల్పనుంది. దీనికోసం జెన్‌కో అధికారులు స్థలాన్ని సేకరించే పనిలో పడ్డారు. 500 మెగావాట్ల కేంద్రాన్ని ఒకే చోట కాకుండా వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని జెన్‌కో యాజమాన్యం నిర్ణయించింది. దీనివల్ల విద్యుత్‌ తరలింపు (ఎవాక్యుయేషన్) సులభతరమౌతుందని భావిస్తోంది. అనంతపురం జిల్లాలోని నంబులపూలకుంటలో 1500 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యం గల సౌరవిద్యుత్‌ పార్కును ఎన్టీపీసీ ఏర్పాటు […]

అనంతపురంలో మరో సౌరవిద్యుత్‌ కేంద్రం ఏర్పాటు కానుంది. దీని ఉత్పాదక సామర్థ్యం 500 మెగావాట్లు. జెన్‌కో యాజమాన్యం సొంతంగా ఈ కేంద్రాన్ని నెలకొల్పనుంది. దీనికోసం జెన్‌కో అధికారులు స్థలాన్ని సేకరించే పనిలో పడ్డారు. 500 మెగావాట్ల కేంద్రాన్ని ఒకే చోట కాకుండా వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని జెన్‌కో యాజమాన్యం నిర్ణయించింది. దీనివల్ల విద్యుత్‌ తరలింపు (ఎవాక్యుయేషన్) సులభతరమౌతుందని భావిస్తోంది. అనంతపురం జిల్లాలోని నంబులపూలకుంటలో 1500 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యం గల సౌరవిద్యుత్‌ పార్కును ఎన్టీపీసీ ఏర్పాటు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో 250 మెగావాట్ల విద్యుత్‌ వచ్చే ఏడాది మార్చి నాటికి అందుబాటులోకి రానుంది. దీనికోసం ఎన్టీపీసీ యాజమాన్యం ఏపీ డిస్కమ్‌లతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. అనంతపురం జిల్లాలో సౌరవిద్యుత్‌ ఉత్పత్తికి అనువైన వాతావరణం, భౌగోళిక స్థితిగతులు ఉండటంతో ప్రభుత్వం మరో 500 మెగావాట్ల సౌర విద్యుత్‌ కేంద్రాన్ని అనంతపురం జిల్లాకు ఇటీవలే మంజూరు చేసింది. దీనికోసం తాడిపత్రి, పెనుకొండ, గుంతకల్లు, కదిరి, పుట్టపర్తి పరిసర ప్రాంతాల్లో స్థలం కోసం అన్వేషణ జరుగుతోంది.
First Published:  15 July 2015 1:20 PM GMT
Next Story