Telugu Global
National

స్కైప్‌, వాట్స‌ప్ దేశీయ కాల్స్‌పై ప‌రిమితి

నెటిజ‌న్లు ప‌రిమితులు లేకుండా వినియోగిస్తున్న వాట్స‌ప్‌, స్కైప్, వైబ‌ర్ వంటి దేశీయ‌ కాలింగ్  సేవ‌ల‌పై అప్లికేష‌న్లపై ప‌రిమితి విధించాల‌ని నెట్  న్యూట్రాలిటీ వివాదంపై ఏర్పాటు చేసిన ప్ర‌భుత్వ క‌మిటీ ప్ర‌తిపాదించింది. ఈ సేవ‌ల‌ను అందిస్తున్న ఇంట‌ర్నేష‌న‌ల్ కాలింగ్  సేవ‌ల ప‌ట్ల ఉదారంగా వ్య‌వ‌హ‌రించ‌వ‌చ్చని, దేశీయ  సేవ‌ల‌కు మాత్రం నియంత్ర‌ణ విధించాల‌ని క‌మిటీ స్ప‌ష్టం చేసింది.  ఫేస్‌బుక్‌, రిల‌య‌న్స్ క‌మ్యూనికేష‌న్స్ క‌లిసి ఇండియాలో అందిస్తున్న ఇంట‌ర్నెట్ డాట్ ఓఆర్‌జీ  సేవ‌ల‌ను  కూడా క‌మిటీ వ్య‌తిరేకించింది. అంతేకాదు ఇదే త‌ర‌హా […]

స్కైప్‌, వాట్స‌ప్ దేశీయ కాల్స్‌పై ప‌రిమితి
X
నెటిజ‌న్లు ప‌రిమితులు లేకుండా వినియోగిస్తున్న వాట్స‌ప్‌, స్కైప్, వైబ‌ర్ వంటి దేశీయ‌ కాలింగ్ సేవ‌ల‌పై అప్లికేష‌న్లపై ప‌రిమితి విధించాల‌ని నెట్ న్యూట్రాలిటీ వివాదంపై ఏర్పాటు చేసిన ప్ర‌భుత్వ క‌మిటీ ప్ర‌తిపాదించింది. ఈ సేవ‌ల‌ను అందిస్తున్న ఇంట‌ర్నేష‌న‌ల్ కాలింగ్ సేవ‌ల ప‌ట్ల ఉదారంగా వ్య‌వ‌హ‌రించ‌వ‌చ్చని, దేశీయ సేవ‌ల‌కు మాత్రం నియంత్ర‌ణ విధించాల‌ని క‌మిటీ స్ప‌ష్టం చేసింది. ఫేస్‌బుక్‌, రిల‌య‌న్స్ క‌మ్యూనికేష‌న్స్ క‌లిసి ఇండియాలో అందిస్తున్న ఇంట‌ర్నెట్ డాట్ ఓఆర్‌జీ సేవ‌ల‌ను కూడా క‌మిటీ వ్య‌తిరేకించింది. అంతేకాదు ఇదే త‌ర‌హా సేవ‌లందిస్తున్న జీరో ప్రాజెక్టుకు టెలికం అనుమ‌తులు త‌ప్ప‌నిస‌ర‌ని క‌మిటీ స్ప‌ష్టం చేసింది. ఈ ప్ర‌తిపాద‌న‌ల‌పై వ‌చ్చే నెల 15లోగా త‌మ అభిప్రాయాల‌ను, సూచ‌న‌ల‌ను తెలియ జేయాల‌ని ప్ర‌జ‌ల‌ను క‌మిటీ కోరింది. అయితే, ఈ క‌మిటీ ప్ర‌తిపాద‌న‌ల‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కేవ‌లం దేశీయ కాల్స్ పైన మాత్ర‌మే నియంత్ర‌ణ విధించ‌డం వ‌ల‌న నెటిజ‌న్ల గోప్య‌తను భంగ‌ప‌రిచిన‌ట్టు అవుతుంద‌ని ఐటీ నిపుణులు అభిప్రాయ ప‌డుతున్నారు.
First Published:  17 July 2015 12:50 AM GMT
Next Story