Telugu Global
Cinema & Entertainment

విదేశీయుల కోసం బాహుబ‌లిని ఎలా క‌ట్ చేస్తారో..!

బాహుబ‌లి ఒక దృశ్య కావ్యం గా ప్ర‌శంస‌లు అందుకుంటుంది.  అయితే ఈసినిమాను కేవ‌లం భార‌తీయ సినిమా అభిమానుల‌కే కాకుండ‌..  డైరెక్ట‌ర్ రాజ‌మౌళి  బాహుబ‌లిని   విదేశీయుల‌కు చూపించాల‌ని  ప్లాన్ చేశారు.ఫారిన్ ఆడియ‌న్స్ కోసం స్పెష‌ల్ గా  ఎడిట్ చేయిస్తున్న‌ట్లు  బాహుబ‌లి నిర్మాత  శోభు యార్ల‌గ‌డ్డ  తెలియ చేశారు. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఎడిట‌ర్  విన్సెంట్ ట‌బాలియ‌న్ సార‌ధ్యంలో  ఎడిటింగ్ వ‌ర్క్ ప్రారంభించార‌ట‌.  ఈ ఎడిట‌ర్ గ‌తంలో ఇన్ క్రెడిబుల్ హ‌ల్స్.. క్లాష్ ఆఫ్ ది టైటాన్స్, లెజెండ్ ఆఫ్ హెర్క్యూల‌స్  […]

విదేశీయుల కోసం బాహుబ‌లిని ఎలా క‌ట్ చేస్తారో..!
X

బాహుబ‌లి ఒక దృశ్య కావ్యం గా ప్ర‌శంస‌లు అందుకుంటుంది. అయితే ఈసినిమాను కేవ‌లం భార‌తీయ సినిమా అభిమానుల‌కే కాకుండ‌.. డైరెక్ట‌ర్ రాజ‌మౌళి బాహుబ‌లిని విదేశీయుల‌కు చూపించాల‌ని ప్లాన్ చేశారు.ఫారిన్ ఆడియ‌న్స్ కోసం స్పెష‌ల్ గా ఎడిట్ చేయిస్తున్న‌ట్లు బాహుబ‌లి నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ తెలియ చేశారు. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఎడిట‌ర్ విన్సెంట్ ట‌బాలియ‌న్ సార‌ధ్యంలో ఎడిటింగ్ వ‌ర్క్ ప్రారంభించార‌ట‌. ఈ ఎడిట‌ర్ గ‌తంలో ఇన్ క్రెడిబుల్ హ‌ల్స్.. క్లాష్ ఆఫ్ ది టైటాన్స్, లెజెండ్ ఆఫ్ హెర్క్యూల‌స్ వంటి చిత్రాల‌కు ఆయ‌న వ‌ర్క్ చేశారు. ఒరిజ‌న‌ల్ వెర్ష‌న్ కు కాస్తా భిన్నంగా ఈ చిత్రం ఉండ బోతుంద‌ని ..వ‌చ్చెనెల ఆఖ‌ర‌కు సిద్దం చేసి విదేశాల్లో రిలీజ్ చేయ‌డానికి ప్ర‌ణాళిక చేస్తున్నారు. మొత్తం మీద మ‌న ఖ్యాతి ఖండంతారాల‌కు వ్యాపింప చేస్తుంది మ‌న బాహుబ‌లి..! వ‌న్స్ ఎగైన్ హ‌ట్సాఫ్ టు రాజ‌మౌళి అండ్ టీమ్..!

First Published:  17 July 2015 5:43 AM GMT
Next Story