Telugu Global
Cinema & Entertainment

 కాజ‌ల్ కూడా అమ‌లాపాల్ బాట‌లో న‌డుస్తుందా..!

ప్ర‌తి ఒక్కరికి  కొన్ని చికాకు పుట్టించే ప్ర‌శ్న‌లుంటాయి.  సెలిబ్రిటీలు ఈ విష‌యంలో మిన‌హాయింపు కాదు.     మ‌రి మ‌న అందాల చంద‌మామ  కాజ‌ల్ కు కూడా ఒక ప్ర‌శ్న  బాగా చికాకు తెప్పిస్తుంటుంద‌ట‌.  అదే  మీడియా వారు మీ పెళ్లి  ఎప్పుడు అని  అడిగిన‌ప్పుడు.  త‌న‌కు  పెళ్లి చేసుకోవాల‌నే వుంద‌ట‌.  కానీ  ఇంత వ‌ర‌కు త‌న మన‌సు దోచుకున్న  మాన‌స చోరుడు క‌నిపించ‌లేద‌ట‌. అయితే త‌న‌కు విసుగు పుట్టించే మ‌రో ప్ర‌శ్న ఏమిటంటే..   పెళ్లి త‌రువాత న‌టిస్తారా..?ఈ […]

 కాజ‌ల్ కూడా అమ‌లాపాల్ బాట‌లో న‌డుస్తుందా..!
X

ప్ర‌తి ఒక్కరికి కొన్ని చికాకు పుట్టించే ప్ర‌శ్న‌లుంటాయి. సెలిబ్రిటీలు ఈ విష‌యంలో మిన‌హాయింపు కాదు. మ‌రి మ‌న అందాల చంద‌మామ కాజ‌ల్ కు కూడా ఒక ప్ర‌శ్న బాగా చికాకు తెప్పిస్తుంటుంద‌ట‌. అదే మీడియా వారు మీ పెళ్లి ఎప్పుడు అని అడిగిన‌ప్పుడు. త‌న‌కు పెళ్లి చేసుకోవాల‌నే వుంద‌ట‌. కానీ ఇంత వ‌ర‌కు త‌న మన‌సు దోచుకున్న మాన‌స చోరుడు క‌నిపించ‌లేద‌ట‌. అయితే త‌న‌కు విసుగు పుట్టించే మ‌రో ప్ర‌శ్న ఏమిటంటే..

పెళ్లి త‌రువాత న‌టిస్తారా..?ఈ ప్ర‌శ్న‌ను కూడా త‌నను ఎక్కువుగా అడుగుతుంటార‌ట‌. దీనికి సంబంధించి త‌న‌కు బాగా కోపం వ‌స్తుంద‌ట‌. పెళ్లి అయితే ఎవ‌రి ప్రొఫెష‌న్స్ వాళ్లు కంటిన్యూ చేసుకోరా..? అలాగే హీరోయిన్స్ కూడా..? ఈ విష‌యంలో త‌న ఫ్రెండ్ అమ‌లాపాల్ త‌న‌కు ఆద‌ర్శ‌మని సెల‌విచ్చింది. కెరీర్ మంచి జోరు మీద‌నుప్పుడే హీరోయిన్ అమ‌లాపాల్ .. త‌మిళ ద‌ర్శ‌కుడు విజ‌య్ ను ప్రేమ వివాహాం చేసుకున్న విష‌యం తెలిసిందే. అయితే పెళ్లి త‌రువాత అమ‌లాపాల్ పూర్తిగా సినిమాల‌కు ఏమి దూరం కాలేద‌ని..త‌ను న‌టిస్తుంద‌ని గుర్తు చేసుకుంది. ఈ విష‌యం లో త‌నకు అమ‌లాపాలే ఆద‌ర్శ‌మ‌ని సెల‌విచ్చింది. సో హీరోయిన్ గా త‌న‌కు ఇప్ప‌ట్లో రిటైర్మెంట్ అనే ఆలోచ‌నే లేద‌న్న‌మాట‌. ఎంతైనా గ్లామ‌ర్ క్వీన్ పోస్ట్ క‌దా. ! అంత ఈజిగా వ‌ద‌లుకుంటారా కాజ‌ల్ లాంటి హీరోయిన్..?

First Published:  17 July 2015 10:00 PM GMT
Next Story