Telugu Global
Cinema & Entertainment

బ్యాంగ్ బ్యాంగ్ కు సీక్వెల్ రెడీ..!

హృతిక్ రోష‌న్, క‌త్రీనా కైఫ్  లీడ్ రోల్స్ లో ద‌ర్శ‌కుడు సిద్దార్ద్ ఆనంద్   చేసిన బ్యాంగ్ బ్యాంగ్ చిత్రం  ఒక రేంజ్  స‌క్సెస్ అయ్యింది.  నిర్మాత‌ల‌కు కాసుల వ‌ర్షం కురిపించింది.   దీంతో  బ్యాంగ్ బ్యాంగ్ సినిమాకు సీక్వెల్ చేయ‌డానికి నిర్మాత‌లు రంగం సిద్దం చేశార‌ని బి టౌన్ లో టాక్ వినిపిస్తుంది. ప్ర‌స్తుతం హృతిక్ రోష‌న్  ఆశుతోష్ గోవార‌క‌ర్ డైరెక్ష‌న్ లో మోహంజ‌దారో చిత్రం  చేస్తున్నారు.  ఈ సినిమా కంప్లీట్ కాగ‌నే..  బ్యాంగ్ బ్యాంగ్  సినిమా సీక్వెల్ […]

బ్యాంగ్ బ్యాంగ్ కు సీక్వెల్  రెడీ..!
X

హృతిక్ రోష‌న్, క‌త్రీనా కైఫ్ లీడ్ రోల్స్ లో ద‌ర్శ‌కుడు సిద్దార్ద్ ఆనంద్ చేసిన బ్యాంగ్ బ్యాంగ్ చిత్రం ఒక రేంజ్ స‌క్సెస్ అయ్యింది. నిర్మాత‌ల‌కు కాసుల వ‌ర్షం కురిపించింది. దీంతో బ్యాంగ్ బ్యాంగ్ సినిమాకు సీక్వెల్ చేయ‌డానికి నిర్మాత‌లు రంగం సిద్దం చేశార‌ని బి టౌన్ లో టాక్ వినిపిస్తుంది.

ప్ర‌స్తుతం హృతిక్ రోష‌న్ ఆశుతోష్ గోవార‌క‌ర్ డైరెక్ష‌న్ లో మోహంజ‌దారో చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ కాగ‌నే.. బ్యాంగ్ బ్యాంగ్ సినిమా సీక్వెల్ చేయ‌డానికి హృతిక్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చార‌ని టాక్. అయితే ఈ సీక్వెల్ కు కత్రీనా కైఫ్ కు బ‌దులుగా .. కొత్త హీరోయిన్ ను తీసుకోవాల‌నే ఆలోచ‌న‌లో ప్రొడ్యూస‌ర్స్ వున్న‌ట్లు బి టైన్ లో గుస గుస‌లు వినిపిస్తుంది. కొత్త హీరోయిన్ అయితే ఫ్రెష్ లుక్ వుంటుంద‌నేది నిర్మాత‌ల ఆలోచ‌న‌గా తెలుస్తుంది.

First Published:  17 July 2015 8:40 PM GMT
Next Story