Telugu Global
Cinema & Entertainment

ఆ గుసుగుస‌ల్లో నిజ‌మెంతో…!

రవితేజ నటించిన ‘కిక్‌ 2′ ఇంకా విడుదల కాలేదు. ఆగస్టు 14న విడుదల అవుతుందో లేక ఇంకా ముందుకి, లేదావెనక్కి వెళుతుందో అనేది ఇంకా తేలలేదు. ఈ చిత్రానికి బడ్జెట్‌ అనుకున్న దానికంటే ఎక్కువ కావడంతో బిజినెస్‌ పరంగా సమస్యలు వస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.  ద‌ర్శ‌కుడు సురెంద‌రెడ్డి..  క‌ళ్యాణరామ్  బ్యాన‌ర్ లో  ఈ సినిమాను చేసిన విష‌యం తెలిసిందే.  కిక్ ఘ‌న విజ‌యం సాధించ‌డంతో..ఈ సీక్వెల్ చేశారు. అయితే ఖ‌ర్చు అనుకున్న దానికంటే మించిపోవ‌డంతో.. ఎక్కువ రేటు […]

ఆ గుసుగుస‌ల్లో నిజ‌మెంతో…!
X

రవితేజ నటించిన ‘కిక్‌ 2′ ఇంకా విడుదల కాలేదు. ఆగస్టు 14న విడుదల అవుతుందో లేక ఇంకా ముందుకి, లేదావెనక్కి వెళుతుందో అనేది ఇంకా తేలలేదు. ఈ చిత్రానికి బడ్జెట్‌ అనుకున్న దానికంటే ఎక్కువ కావడంతో బిజినెస్‌ పరంగా సమస్యలు వస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ద‌ర్శ‌కుడు సురెంద‌రెడ్డి.. క‌ళ్యాణరామ్ బ్యాన‌ర్ లో ఈ సినిమాను చేసిన విష‌యం తెలిసిందే. కిక్ ఘ‌న విజ‌యం సాధించ‌డంతో..ఈ సీక్వెల్ చేశారు. అయితే ఖ‌ర్చు అనుకున్న దానికంటే మించిపోవ‌డంతో.. ఎక్కువ రేటు చెబుతున్నార‌ట‌. దీంతో బ‌య్య‌ర్లు కొంత వెన‌కడగు వేస్తున్నార‌నే టాక్ వినివ‌స్తుంది. మ‌రి ర‌వితేజ లాంటి ఒక మాస్ ఇమేజ్ వున్న హీరో సినిమాకు కాస్త బ‌డ్జెట్ ఎక్కువైతే .. ప్రొడ‌క్ట్ అమ్మ‌డం క‌ష్టంగా వుందంటే.. ఇక స్టార్ డ‌మ్ లేకుండా.. సినిమా నిర్మాణం ప‌ట్ల అవ‌గాహాన‌లేకుండా చిత్రాలు చేసే వాళ్ల ప‌రిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో.. మాట‌ల్లో చెప్ప‌డం క‌ష్ట‌మే క‌దా.!

First Published:  17 July 2015 7:00 PM GMT
Next Story