Telugu Global
Others

మిత్రులను కూడగడుతున్న ప్రధాని మోడి

లలిత్‌మోదీ, వ్యాపం తదితర అంశాల్లో పార్లమెంట్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని ప్రతిపక్షాలు చేస్తున్న వ్యూహాలకు ప్రధాని నరేంద్రమోదీ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ఇందులోభాగంగా ఎన్డీయే మిత్రపక్షాల ఎంపీలతో సోమవారం తొలిసారి భేటీ కానున్నారు. ప్రతిపక్షాల ఎత్తును తిప్పికొట్టేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించేలా మిత్రపక్షాలకు సూచనలు చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి, మే 2014లో అధికారం చేపట్టిన తర్వాత మిత్రపక్షాలతో భేటీకానుండటం ఇదే మొదటిసారి కానున్నది. ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు తొలిరోజు నుంచే […]

మిత్రులను కూడగడుతున్న ప్రధాని మోడి
X
లలిత్‌మోదీ, వ్యాపం తదితర అంశాల్లో పార్లమెంట్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని ప్రతిపక్షాలు చేస్తున్న వ్యూహాలకు ప్రధాని నరేంద్రమోదీ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ఇందులోభాగంగా ఎన్డీయే మిత్రపక్షాల ఎంపీలతో సోమవారం తొలిసారి భేటీ కానున్నారు. ప్రతిపక్షాల ఎత్తును తిప్పికొట్టేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించేలా మిత్రపక్షాలకు సూచనలు చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి, మే 2014లో అధికారం చేపట్టిన తర్వాత మిత్రపక్షాలతో భేటీకానుండటం ఇదే మొదటిసారి కానున్నది. ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు తొలిరోజు నుంచే వేడిపుట్టించనున్నాయి. ఐపీఎల్‌ మాజీ కమిషనర్‌ లలిత్‌ మోదీకి సాయం చేసినట్లు ఆరోపణలు వచ్చిన విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, ఇతర కుంభకోణాల్లో ఇరుక్కున్న మరో ఇద్దరు బీజేపీ రాష్ట్రాల సీఎంలు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, రమణ్‌ సింగ్‌లు రాజీనామా చేసే ప్రసక్తి లేదని ప్రభుత్వం తేల్చి చెప్పడంతో ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. పార్లమెంట్‌ సమావేశాలలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు తమ వ్యూహానికి పదును పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ పర్యటనను ముగించుకుని తిరిగివచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ సహచర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అరుణ్‌ జైట్లీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాతో విడివిడిగా సమావేశమయ్యారు. వర్షాకాల సమావేశాలలో ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ పరిస్థితి తదితర అంశాలపై వారు కీలక చర్చలు జరిపారు. ప్రధాని దృష్టికి రాజ్‌నాథ్‌ అనేక విషయాలను తీసుకువెళ్లినట్లు ఆ వర్గాలు వివరించాయి. జమ్ము పర్యటనలో భాగంగా పార్లమెంటులో పోరాటానికి సిద్ధం అని సంకేతాలిచ్చిన ప్రధాని.. ఆ తర్వాత మిత్రపక్షాలతో భేటీ కావాలని నిర్ణయించడం గమనార్హం. ఈసారి సమావేశాలలో ప్రభుత్వం శాసనపరమైన, ఆర్థికపరమైన 35 దాకా బిల్లులను తీసుకురావాలని భావిస్తోంది. వీటిని ఏ ఆటంకాలు లేకుండా గట్టెక్కించుకోవాలంటే ప్రతిపక్షాలతోపాటు మిత్రపక్షాల సహకారం కూడా కావాలని మోడీ భావిస్తున్నారు. పైగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా ఆయన మిత్రపక్షాలతో సమావేశం కాలేదు. సయోధ్య కొనసాగించడంతోపాటు పార్లమెంటు సమావేశాల్లో మిత్రులంతా ఒకే మాట మీద ఉన్నట్టు కనిపించేలా చేయడానికి ఈ సమావేశం ఉపయోగపడుతుందని బీజేపీ పెద్దలు భావించడం వల్లే ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నారు. కాగా, స్పీకర్ సుమిత్రా మహాజన్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు నేతృత్వంలో సోమవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు.
First Published:  18 July 2015 10:19 PM GMT
Next Story