Telugu Global
Cinema & Entertainment

ఫిలిం చాంబర్ అధ్యక్షుడిగా సురేష్‌బాబు

తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఎన్నికలు ఆదివారం హైదరాబాద్‌లో జరిగాయి. 2014-15 సంవత్సరానికిగాను చాంబర్ అధ్యక్షుడిగా డీ సురేష్‌బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వాణిజ్యమండలిలోని నాలుగు విభాగాలకు జరిగిన ఎన్నికల్లో మన ప్యానల్‌పై పొగ్రెసివ్ ప్యానల్ ఘన విజయాన్ని సాధించింది. ఈ ఎన్నికల్లో ఎగ్జిబిటర్స్ సెక్టార్ చైర్మన్‌గా డీ సురేష్‌బాబు, డిస్టిబ్యూటర్స్ సెక్టార్ చైర్మన్‌గా భరత్‌భూషణ్, స్టూడియో సెక్టార్ చైర్మన్‌గా జెమిని కిరణ్, నిర్మాతల సెక్టార్ చైర్మన్‌గా ప్రతాని రామకృష్ణగౌడ్ ఎంపికయ్యారు. అలాగే చాంబర్ ఉపాధ్యక్షుడిగా దిల్‌రాజు, […]

ఫిలిం చాంబర్ అధ్యక్షుడిగా సురేష్‌బాబు
X
తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఎన్నికలు ఆదివారం హైదరాబాద్‌లో జరిగాయి. 2014-15 సంవత్సరానికిగాను చాంబర్ అధ్యక్షుడిగా డీ సురేష్‌బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వాణిజ్యమండలిలోని నాలుగు విభాగాలకు జరిగిన ఎన్నికల్లో మన ప్యానల్‌పై పొగ్రెసివ్ ప్యానల్ ఘన విజయాన్ని సాధించింది. ఈ ఎన్నికల్లో ఎగ్జిబిటర్స్ సెక్టార్ చైర్మన్‌గా డీ సురేష్‌బాబు, డిస్టిబ్యూటర్స్ సెక్టార్ చైర్మన్‌గా భరత్‌భూషణ్, స్టూడియో సెక్టార్ చైర్మన్‌గా జెమిని కిరణ్, నిర్మాతల సెక్టార్ చైర్మన్‌గా ప్రతాని రామకృష్ణగౌడ్ ఎంపికయ్యారు. అలాగే చాంబర్ ఉపాధ్యక్షుడిగా దిల్‌రాజు, ప్రధాన కార్యదర్శిగా దామోదర్‌ప్రసాద్, కోశాధికారిగా కొడాలి వెంకటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శులుగా ముత్యాల రాందాసు, సురేందర్‌రెడ్డి ఎన్నికయ్యారు.
First Published:  19 July 2015 6:59 PM GMT
Next Story