Telugu Global
Others

నిత్యం 47 మందితో ర‌హ‌దారులు రక్తసిక్తం!

రాష్ట్ర ర‌హ‌దారులు నెత్తురోడుతున్నాయి. రాష్ట్రంలోని ర‌హ‌దారులు ప్ర‌తి రోజూ 47 మందిని బ‌లి తీసుకుంటున్నాయ‌ని నేష‌న‌ల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూర్ గ‌ణాంకాల్లో తేట‌తెల్ల‌మైంది. 2014 నివేదిక ప్ర‌కారం రోడ్డు ప్ర‌మాదాల్లో త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్ర‌, క‌ర్నాట‌క‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లు అగ్ర‌స్థానంలో ఉండ‌గా, తెలంగాణ ప‌దో స్థానంలో ఉంది. తెలంగాణ‌లో గ‌త ఏడాది మొత్తం 20,078 ప్ర‌మాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్ర‌మాదాల్లో 16,696 మంది మ‌ర‌ణించారు. ఈ గ‌ణాంకాల ప్ర‌కారం రోజుకు స‌రాస‌రి 55 ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయ‌ని, 47మంది మ‌ర‌ణిస్తున్నార‌ని […]

నిత్యం 47 మందితో ర‌హ‌దారులు రక్తసిక్తం!
X

రాష్ట్ర ర‌హ‌దారులు నెత్తురోడుతున్నాయి. రాష్ట్రంలోని ర‌హ‌దారులు ప్ర‌తి రోజూ 47 మందిని బ‌లి తీసుకుంటున్నాయ‌ని నేష‌న‌ల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూర్ గ‌ణాంకాల్లో తేట‌తెల్ల‌మైంది. 2014 నివేదిక ప్ర‌కారం రోడ్డు ప్ర‌మాదాల్లో త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్ర‌, క‌ర్నాట‌క‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లు అగ్ర‌స్థానంలో ఉండ‌గా, తెలంగాణ ప‌దో స్థానంలో ఉంది. తెలంగాణ‌లో గ‌త ఏడాది మొత్తం 20,078 ప్ర‌మాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్ర‌మాదాల్లో 16,696 మంది మ‌ర‌ణించారు. ఈ గ‌ణాంకాల ప్ర‌కారం రోజుకు స‌రాస‌రి 55 ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయ‌ని, 47మంది మ‌ర‌ణిస్తున్నార‌ని ఎన్‌సీఆర్‌బీ వెల్ల‌డించింది. మ‌ర‌ణించిన‌వారిలో యువ‌త‌, మ‌ధ్య వ‌య‌సు వారి సంఖ్యే అధికంగా ఉంది. ఉద్యోగం, ఇత‌ర అవ‌కాశాల కోసం ప్ర‌తిరోజూ ప్ర‌యాణిస్తున్న వారి సంఖ్య అధిక‌మైంది. ఈ రోడ్డు ప్ర‌మాదాల్లో అత్య‌ధిక సంఖ్య‌లో ప్రయాణికుల సంఖ్యే ఎక్కువ‌గా ఉంద‌ని ఎన్‌సీఆర్‌బీ తెలిపింది. 18 నుంచి 45 ఏళ్ల వ‌య‌సు లోపు వారు 10,048 మంది ఉన్నార‌ని తేలింది. వ్య‌క్తిగ‌త వాహ‌నాలు వినియోగిస్తున్న వారే అత్య‌ధికంగా ప్ర‌మాదాల బారిన ప‌డి మ‌ర‌ణిస్తున్నార‌ని, వీరిలో మ‌హిళ‌ల కంటే పురుషుల సంఖ్య ఎక్కువ‌గా ఉంద‌ని నివేదిక వెల్ల‌డించింది. రోడ్డు ప్ర‌మాదాల్లో మ‌ర‌ణిస్తున్న పురుషుల సంఖ్య 8,240 కాగా, మ‌హిళ‌ల సంఖ్య 1,808గా న‌మోదైంది. ఈ ప్ర‌మాదాల కార‌ణంగా అనేక కుటుంబాలు కుటుంబ పెద్ద‌ల‌ను కోల్పోయి ఆర్థికంగా చితికి పోతున్నాయి. డ్రైవింగ్ రాక‌పోయినా, మైన‌ర్లు రోడ్ల మీదకు దూసుకువ‌చ్చి ప్ర‌మాదాల బారిన ప‌డి మ‌ర‌ణిస్తున్నారు. ఈ రోడ్డు ప్ర‌మాదాలు డిసెంబ‌రు నెల‌లోనే అత్య‌ధికంగా న‌మోద‌వుతున్నాయి. ఏడాది మొత్తం మీద జ‌రిగిన ప్ర‌మాదాల్లో 2,171 యాక్సిడెంట్లు అంటే ప‌దో వంతు ప్ర‌మాదాలు డిసెంబ‌రులోనే జ‌రిగాయ‌ని నివేదిక తెలిపింది. అందుకు కార‌ణం శీతాకాలం పొగ‌మంచులో ఎదురుగా వ‌చ్చే వాహ‌నాలు క‌న‌ప‌డ‌క పోవ‌డ‌మేన‌ని నివేదిక‌లో వెల్ల‌డైంది. అతి త‌క్కువ‌గా సెప్టెంబ‌రు నెల‌లో నమోద‌య్యాయి. రోడ్డు ప్ర‌మాదాలు అత్య‌ధికంగా సాయంత్రం 6 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల్లోపు, అతి త‌క్కువ‌గా అర్థ‌రాత్రి 12 గంట‌ల నుంచి తెల్ల‌వారుజామున 3 లోపు జ‌రుగుతున్నాయ‌ని స‌ర్వేలో వెల్ల‌డైంది.

First Published:  21 July 2015 1:20 AM GMT
Next Story