Telugu Global
Others

కడియం రాజీనామాకు స్పీకర్ ఆమోదం

వరంగల్ పార్లమెంటు స్థానానికి తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమర్పించిన రాజీనామాకు ఆమోదముద్ర పడింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమైన నేపథ్యంలో శ్రీహరి రాజీనామాను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించినట్టు ప్రకటించారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో శ్రీహరి వరంగల్ స్థానం నుంచి శ్రీహరి ఎంపీగా ఎన్నికయ్యారు. తదనంతర కాలంలో చోటు చేసుకున్న పలు పరిణామాలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి డాక్టర్ రాజయ్యను తొలగించిన సిఎం కేసీఆర్, ఆ […]

కడియం రాజీనామాకు స్పీకర్ ఆమోదం
X
వరంగల్ పార్లమెంటు స్థానానికి తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమర్పించిన రాజీనామాకు ఆమోదముద్ర పడింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమైన నేపథ్యంలో శ్రీహరి రాజీనామాను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించినట్టు ప్రకటించారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో శ్రీహరి వరంగల్ స్థానం నుంచి శ్రీహరి ఎంపీగా ఎన్నికయ్యారు. తదనంతర కాలంలో చోటు చేసుకున్న పలు పరిణామాలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి డాక్టర్ రాజయ్యను తొలగించిన సిఎం కేసీఆర్, ఆ స్థానాన్ని కడియంకు అప్పగించి విద్యాశాఖ బాధ్యతలను కూడా కట్టబెట్టారు. తర్వాత ఎమ్మెల్సీగా శాసనమండలిలోకి కడియం అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో వరంగల్ ఎంపీ స్థానానికి ఆయన ఇచ్చిన రాజీనామాను నేడు స్పీకర్ ఆమోదించారు. ఈ పరిణామంతో వరంగల్ ఎంపీ స్థానానికి మరో ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సన్నద్ధం కావాల్సి ఉంది.
First Published:  21 July 2015 1:08 AM GMT
Next Story