Telugu Global
Cinema & Entertainment

 మాయ‌బ‌జార్ అంటే పిచ్చి..!

ఏదో ఒక పిచ్చి లేక‌పోతే ర‌చ‌యిత ల‌వ్వ‌డం క‌ష్టం. పిచ్చి అంటే  హ‌ని చేసే చెడులు కాదండోయ్.  మ‌నో వికాసం క‌లిగించే ఏదో ఒక అల‌వాటు కాస్త ఎక్కువుగా ఉండ‌టం.   ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్  కు  మ‌న మాయ‌బ‌జార్.. అలాగే షోలే చిత్రాలంటే ఆల్మోస్ట్ ఒక పిచ్చి. ఆయ‌న క‌థ  రాయ‌బోయో ముందు క‌చ్చితంగా  ఈ రెండు చిత్రాలు ఒక సారి చూడందే క‌థ రాయ‌ర‌ట‌. త‌న‌కు చిన్న నాటి నంచి మాయ‌బజార్ చిత్ర‌మంటే ఒక పిచ్చి […]

 మాయ‌బ‌జార్ అంటే పిచ్చి..!
X

ఏదో ఒక పిచ్చి లేక‌పోతే ర‌చ‌యిత ల‌వ్వ‌డం క‌ష్టం. పిచ్చి అంటే హ‌ని చేసే చెడులు కాదండోయ్. మ‌నో వికాసం క‌లిగించే ఏదో ఒక అల‌వాటు కాస్త ఎక్కువుగా ఉండ‌టం. ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ కు మ‌న మాయ‌బ‌జార్.. అలాగే షోలే చిత్రాలంటే ఆల్మోస్ట్ ఒక పిచ్చి. ఆయ‌న క‌థ రాయ‌బోయో ముందు క‌చ్చితంగా ఈ రెండు చిత్రాలు ఒక సారి చూడందే క‌థ రాయ‌ర‌ట‌. త‌న‌కు చిన్న నాటి నంచి మాయ‌బజార్ చిత్ర‌మంటే ఒక పిచ్చి ..అలాగే త‌ను స్క్రీన్ ప్లే అనేది స‌లీమ్ జావ‌దే రాసిన షోల్ చిత్ర క‌థ నుంచే నేర్చుకున్నార‌ట‌.
బాహుబ‌లి చిత్ర క‌థ రాయ‌డం త‌న‌కు ఎంతో ఆనందమని ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ మీడియాకు తెలిపారు. ఈ సినిమా మ‌హాభార‌తం ప్రేర‌ణ‌గానే తెర‌కెక్కిన‌ట్లు చెప్పారు. ఈ సినిమాకు సంబంధించి మొద‌ట శివ‌గామి రోల్ పుట్టింద‌ట‌. ఆ త‌రువాత పుట్టిన రోల్స్ కూడా చాల శ‌క్తివంతంగా ఉండాల‌ని .. అవి అన్ని క‌ల‌సి ఒక రాజుల క‌థ‌లా రాజ‌మౌళి రెడి చేయ‌మ‌ని చెప్పార‌ట‌. అలా పుట్టిందే బాహుబ‌లి.
గ‌తంలో ఎప్పుడో ఓ పాకిస్తానీ జంట‌.. ఇండియాకు వ‌చ్చి త‌మ 12 ఏళ్ల వ‌య‌సు పాప‌కు గుండె అప‌రేష‌న్ చేయించుకు వెళ్లారు. ఆల్మోస్ట్ చ‌నిపోతుంది అనుకున్న పాప‌కు మ‌న డాక్ట‌ర్లు ప్రాణం పోశారు. ఆ సంఘ‌ట‌న ను మ‌న మీడియా హైలెట్ చేసింది. ఇరు దేశాల మ‌ధ్య సౌహ‌ర్దానికి మేలు చేసింది. ఆ పాయింట్ తో రాసిన క‌థేన‌ట భ‌జ‌రంగ్ భాయిజాన్. స‌ల్మాన్ ఖాన్ నటించ‌డంతో ఈ చిత్రం అభిమానుల‌కు బాగా రీచ్ అవుతుంది. మొత్తం మీద విజయేంద్ర ప్ర‌సాద్ గారు క‌థ‌ల‌కు ప్రేర‌ణ రామ‌యాణ , మ‌హాభార‌తాలే కాదండోయ్.. స‌మ‌కాలిన స‌మాజం కూడా.. ! అందుకే ఆయ‌న రాసిన క‌థ‌లు అభిమానుల‌కు బాగా క‌నెక్ట్ అవుతాయి మ‌రి.!

First Published:  22 July 2015 2:00 AM GMT
Next Story