Telugu Global
Cinema & Entertainment

ఈసారైనా క్లిక్ అవుతుందా..

ఈ మధ్య కాలంలో అంజలికి బొత్తిగా టైమ్ కలిసి రావట్లేదు. సినిమాలైతే చేస్తోంది కానీ సరైన బ్రేక్ మాత్రం రావడం లేదు. ఇలాంటి టైమ్ లో తెలుగు-తమిళ భాషల్లో కీలకమైన దశలోకి ఎంటరైంది అంజలి. ఈ ఫేజ్ ను సద్వినియోగం చేసుకుంటే కెరీర్ ఊపందుకుంటుందని భావిస్తోంది. ఇటు తెలుగులో లెజెండ్ బాలయ్య సరసన డిక్టేటర్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం అందుకుంది అంజలి. ఆ సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం నడుస్తోంది. మరోవైపు తమిళనాట కూడా […]

ఈసారైనా క్లిక్ అవుతుందా..
X
ఈ మధ్య కాలంలో అంజలికి బొత్తిగా టైమ్ కలిసి రావట్లేదు. సినిమాలైతే చేస్తోంది కానీ సరైన బ్రేక్ మాత్రం రావడం లేదు. ఇలాంటి టైమ్ లో తెలుగు-తమిళ భాషల్లో కీలకమైన దశలోకి ఎంటరైంది అంజలి. ఈ ఫేజ్ ను సద్వినియోగం చేసుకుంటే కెరీర్ ఊపందుకుంటుందని భావిస్తోంది. ఇటు తెలుగులో లెజెండ్ బాలయ్య సరసన డిక్టేటర్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం అందుకుంది అంజలి. ఆ సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం నడుస్తోంది. మరోవైపు తమిళనాట కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది ఈ ట్రెడిషనల్ బ్యూటీ. అక్కడ ఒకేసారి రెండు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. జయం రవి, విమల్ సినిమాలు ఒకేసారి విడుదలకాబోతున్నాయి. జయం రవి సినిమాలో అల్ట్రామోడ్రన్ అమ్మాయిగా కనిపించనుంది అంజలి. మరోవైపు విమల్ సినిమా మాపిళ్లై సింగంలో పక్కా ట్రెడిషనల్ లుక్ లో కనిపించబోతోంది. ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్కటి క్లిక్కయినా మరోసారి కోలీవుడ్ లో చక్రం తిప్పొచ్చని ఆశపడుతోంది అంజలి.
First Published:  21 July 2015 10:09 PM GMT
Next Story