Telugu Global
Others

చంద్రబాబు "బ్రీఫ్‌డ్‌" మినిస్టర్స్‌...

మంచి ఇంగ్లీషు వచ్చే వరకు ఆంగ్ల ఛానళ్ళ జోలికి పోవద్దని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన కేబినెట్‌ సహచరులకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చీరాని ఇంగ్లీషుతో అటు ప్రభుత్వ పరువు, ఇటు పార్టీ పరువు పోతుందని ఆయన బాధ పడుతున్నారు. ఇటీవల కాలంలో ఓ ఆంగ్ల ఛానల్‌లో వచ్చిన చర్చా వేదికలో పాల్గొన్న మంత్రులు ప్రభుత్వ వైఖరినిగాని, పార్టీ స్టాండ్‌నిగాని ప్రతిబింబించలేక పోయారని ఆయన వారికి సున్నితంగా చెప్పారు. ఆ ఆంగ్ల ఛానల్‌ చర్చల్లో మొదటిరోజు సీఎం […]

చంద్రబాబు బ్రీఫ్‌డ్‌ మినిస్టర్స్‌...
X

మంచి ఇంగ్లీషు వచ్చే వరకు ఆంగ్ల ఛానళ్ళ జోలికి పోవద్దని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన కేబినెట్‌ సహచరులకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చీరాని ఇంగ్లీషుతో అటు ప్రభుత్వ పరువు, ఇటు పార్టీ పరువు పోతుందని ఆయన బాధ పడుతున్నారు. ఇటీవల కాలంలో ఓ ఆంగ్ల ఛానల్‌లో వచ్చిన చర్చా వేదికలో పాల్గొన్న మంత్రులు ప్రభుత్వ వైఖరినిగాని, పార్టీ స్టాండ్‌నిగాని ప్రతిబింబించలేక పోయారని ఆయన వారికి సున్నితంగా చెప్పారు. ఆ ఆంగ్ల ఛానల్‌ చర్చల్లో మొదటిరోజు సీఎం రమేష్‌, మరోరోజు సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, మున్సిపల్‌ శాఖ మంత్రి పి. నారాయణ, వర్ల రామయ్య పాల్గొన్నారు. పుష్కరాల సందర్బంగా జరిగిన తొక్కిసలాటలో 29 మంది చనిపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబును బాధ్యుడ్ని చేస్తూ చర్చా వేదికలో పాల్గొన్న మిగతా వక్తలు ఎడాపెడా వాయించేస్తుంటే తెలుగుదేశం మంత్రులు మాత్రం వారికి తగిన విధంగా సమాధానం చెప్పలేక పోయారన్నది చంద్రబాబు అభిప్రాయం. తగిన విధంగా మంత్రులు ‘పెర్ఫార్మెన్స్‌’ చూపించి ఉంటే అప్రదిష్ట పాలయ్యేవారము కాదనేది ఆయన మనోగతం. ఇకముందు మాత్రం ఎవరూ ఇంగ్లీష్‌ ఛానళ్ళ చర్చల్లో కనిపించవద్దని ఆయన ఆదేశించారు. ఇక ముందు ఇంగ్లీష్‌ ఛానళ్ళలో ఏదైనా చర్చలో పాల్గొనాల్సి వచ్చినా… ఆయా ఛానళ్ళ సందేహాలకు సమాధానాలు చెప్పాల్సి వచ్చినా ఆ బాధ్యతను పార్లమెంట్‌ సభ్యుడు గళ్లా జయదేవ్‌ నిర్వహిస్తారని, ఇంగ్లీషు బాగా వచ్చిన వారిని గుర్తించే వరకు ఢిల్లీలోని మీడియా వ్యవహారాలు కూడా ఆయనే చూసుకుంటారని చంద్రబాబు చెప్పారు.
అయితే పార్లమెంట్‌ సభ్యుడు సీఎం రమేష్‌ గాని, లెక్చరర్‌గా సుధీర్ఘ అనుభవం ఉన్న పల్లె రఘునాథరెడ్డి గాని, విద్యా సంస్థల అధినేత నారాయణ గాని మంచి ఇంగ్లీష్‌రాక ఆ చర్చలో సరిగ్గా సమాధానం చెప్పలేకపోయారా? లేక సమర్థించుకోవడానికి విషయం లేక సరిగ్గా సమాధానం చెప్పలేకపోయారా? అని రాజకీయ విశ్లేషకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  21 July 2015 8:49 PM GMT
Next Story