Telugu Global
Cinema & Entertainment

  విశ్వరూపం-2 అటకెక్కినట్టే..

నిజానికి ఈ పాటికి విశ్వరూపం-2 విడుదలకావాల్సింది. 2013లో విశ్వరూపం రిలీజ్ అయిన టైమ్ లోనే పార్ట్-2 కూడా దాదాపు 60శాతం సిద్ధంగా ఉందని ప్రకటించాడు కమల్ హాసన్. కానీ ఆ కొన్ని రోజులు విశ్వరూపం-2 షూటింగ్ కూడా చేశారు. 2014లో విశ్వరూపం-2 విడుదలవుతుందని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ గతేడాది కాలేదు సరికదా.. ఈ ఏడాది కూడా పార్ట్-2 విడుదల కావట్లేదు. అసలు ఈ సినిమా వస్తుందా రాదా అనే అనుమానాలు కూడా ఎక్కువవుతున్నాయి.    […]

  విశ్వరూపం-2 అటకెక్కినట్టే..
X
నిజానికి ఈ పాటికి విశ్వరూపం-2 విడుదలకావాల్సింది. 2013లో విశ్వరూపం రిలీజ్ అయిన టైమ్ లోనే పార్ట్-2 కూడా దాదాపు 60శాతం సిద్ధంగా ఉందని ప్రకటించాడు కమల్ హాసన్. కానీ ఆ కొన్ని రోజులు విశ్వరూపం-2 షూటింగ్ కూడా చేశారు. 2014లో విశ్వరూపం-2 విడుదలవుతుందని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ గతేడాది కాలేదు సరికదా.. ఈ ఏడాది కూడా పార్ట్-2 విడుదల కావట్లేదు. అసలు ఈ సినిమా వస్తుందా రాదా అనే అనుమానాలు కూడా ఎక్కువవుతున్నాయి.
ప్రస్తుతం చీకటి రాజ్యం అనే ద్విభాషా చిత్రం చేస్తున్నాడు కమల్ హాసన్. ఈ సినిమా కంటే ముందు ఉత్తమ విలన్ చేశాడు. ఉత్తమ్ విలన్ పూర్తయిన తర్వాత విశ్వరూపం-2 చేస్తాడనుకున్నాడు. కానీ చీకటి రాజ్యం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిన తర్వాత కూడా విశ్వరూపం-2 పట్టాలపైకి రావట్లేదు. లింగుస్వామి నిర్మాణ సారధ్యంలో మరో సినిమా చేయాలని నిర్ణయించాడు. సో.. వచ్చే ఏడాది కూడా విశ్వరూపం-2 వచ్చేది అనుమానంగానే కనిపిస్తోంది.
First Published:  22 July 2015 7:00 PM GMT
Next Story