Telugu Global
Others

వారంలోగా కాల్‌డేటా ఇవ్వాల్సిందే... సుప్రీం ఆదేశం

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బెజవాడ కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కాల్‌డేటాను ఇవ్వాల్సిందేనని సర్వీస్‌ ప్రొవైడర్లను సుప్రీంకోర్టు ఆదేశించింది. బెజవాడ్‌ మేజిస్ర్టేట్‌ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సర్వీస్‌ ప్రొవైడర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై గురువారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈనెల 24లోగా కాల్‌డేటా సమర్పించాలన్న విజయవాడ మెజిస్ర్టేట్‌ కోర్టు ఆదేశాలను సుప్రీం సమర్థించింది. కాల్‌డేటా ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కాల్‌డేటా ఇస్తే […]

వారంలోగా కాల్‌డేటా ఇవ్వాల్సిందే... సుప్రీం ఆదేశం
X
ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బెజవాడ కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కాల్‌డేటాను ఇవ్వాల్సిందేనని సర్వీస్‌ ప్రొవైడర్లను సుప్రీంకోర్టు ఆదేశించింది. బెజవాడ్‌ మేజిస్ర్టేట్‌ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సర్వీస్‌ ప్రొవైడర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై గురువారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈనెల 24లోగా కాల్‌డేటా సమర్పించాలన్న విజయవాడ మెజిస్ర్టేట్‌ కోర్టు ఆదేశాలను సుప్రీం సమర్థించింది. కాల్‌డేటా ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కాల్‌డేటా ఇస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రాసిక్యూట్‌ చేస్తామని బెదిరించిన కారణంగానే ఇవ్వలేకపోతున్నామని సర్వీస్‌ ప్రొవైడర్ల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే తెలంగాణ ప్రభుత్వ బెదిరింపులకు లొంగాల్సిన అవసరం లేదన్న సుప్రీంకోర్టు జ్యుడిషియల్‌ ఆర్డర్‌ ఉన్నప్పుడు… దాని ముందు ఏ ఆదేశాలు పని చేయవని, అందువల్ల ఎవరి బెదిరింపులను ఖాతరు చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. తెలంగాణ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడినప్పుడు కోర్టు ఆర్డర్‌ను ఎందుకు చూపించలేదని సర్వీస్‌ ప్రొవైడర్లను ధర్మాసనం ప్రశ్నించింది.
కాల్‌డేటా సమర్పించేందుకు కొంత సమయం కావాలని సర్వీస్‌ ప్రొవైడర్లు కోర్టును కోరగా మరో వారంపాటు సుప్రీం కోర్టు గడువు ఇచ్చింది. కాల్‌డేటా ఇచ్చాక సీల్డ్‌ కవర్‌ను మూడు వారాల వరకు తెరచి చూడకూడదని విజయవాడ మెజిస్ర్టేట్‌ కోర్టుకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. కాల్‌డేటాను స్వీకరించిన అనంతరం విచారణను నెలరోజులపాటు వాయిదా వేయాలని విజయవాడ కోర్టును ఆదేశించింది. కాల్‌డేటాను సర్వీస్‌ ప్రొవైడర్లు నాశనం చేయకూడదని కోర్టు ఆదేశించింది. ఈలోగా అవసరమైతే హైకోర్టులో అప్పీలు చేసుకోవచ్చని సర్వీస్‌ ప్రొవైడర్లకు సుప్రీం కోర్టు సూచించింది. సర్వీస్‌ ప్రొవైడర్ల తరపున ప్రముఖ న్యాయవాది నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. తొలుత ఈకేసును స్వీకరించేందుకు సుప్రీం కోర్టు నిరాకరిస్తూ హైకోర్టు వెళ్లాల్సిందిగా సూచించింది. అయితే ఉమ్మడి హైకోర్టు ఉన్నందుకు అక్కడి వెళ్లలేక పోతున్నామని సర్వీస్‌ ప్రొవైడర్లు తెలిపారు. ఈ క్రమంలో హైకోర్టుతోపాటు అన్ని కోర్టులపైనా విశ్వాసం ఉంచాల్సిన అవసరం ఉందని సర్వీస్‌ ప్రొవైడర్లకు సుప్రీం కోర్టు సూచించింది.
First Published:  23 July 2015 4:32 AM GMT
Next Story