Telugu Global
Others

ఏపీ స‌ర్కారు తీరుపై ప్ర‌ధానికి వైగో ఫిర్యాదు

శేషాచ‌లం ఎన్‌కౌంట‌ర్ ఘ‌ట‌న ఇప్ప‌ట్లో ఏపీ స‌ర్కారును వ‌దిలేలా లేదు. ఇది బూట‌క‌పు ఎన్‌కౌంట‌ర‌ని, ఎర్ర‌చంద‌నం కూలీల‌ను ప‌ట్టుకుని కాల్చి చంపేశార‌ని త‌మిళ పార్టీలు, ప్ర‌జాసంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘ‌ట‌న అప్ప‌ట్లో త‌మిళ‌నాడు-ఆంధ్ర‌ప్ర‌దేశ్ సంబంధాల‌పై ప్ర‌భావం కూడా చూపింది. శేషాచ‌లం ఎన్‌కౌంట‌ర్ బూట‌క‌మ‌ని మొద‌టి నుంచీ ఆరోపిస్తూ వ‌స్తున్న ఎండీఎంకే నేత వైగో..తాజాగా ఈ ఘ‌ట‌న‌పై సీబీఐతో ద‌ర్యాప్తు చేయాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని కోరారు. బుధ‌వారం ప్ర‌ధానితో భేటీ అయిన వైగో ..20 మంది త‌మిళుల‌ను అన్యాయం […]

శేషాచ‌లం ఎన్‌కౌంట‌ర్ ఘ‌ట‌న ఇప్ప‌ట్లో ఏపీ స‌ర్కారును వ‌దిలేలా లేదు. ఇది బూట‌క‌పు ఎన్‌కౌంట‌ర‌ని, ఎర్ర‌చంద‌నం కూలీల‌ను ప‌ట్టుకుని కాల్చి చంపేశార‌ని త‌మిళ పార్టీలు, ప్ర‌జాసంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘ‌ట‌న అప్ప‌ట్లో త‌మిళ‌నాడు-ఆంధ్ర‌ప్ర‌దేశ్ సంబంధాల‌పై ప్ర‌భావం కూడా చూపింది. శేషాచ‌లం ఎన్‌కౌంట‌ర్ బూట‌క‌మ‌ని మొద‌టి నుంచీ ఆరోపిస్తూ వ‌స్తున్న ఎండీఎంకే నేత వైగో..తాజాగా ఈ ఘ‌ట‌న‌పై సీబీఐతో ద‌ర్యాప్తు చేయాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని కోరారు. బుధ‌వారం ప్ర‌ధానితో భేటీ అయిన వైగో ..20 మంది త‌మిళుల‌ను అన్యాయం మ‌ట్టుబెట్టిన ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌ర‌పాల‌ని కోరార‌ని పార్టీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.
First Published:  22 July 2015 1:14 PM GMT
Next Story