Telugu Global
Cinema & Entertainment

ఈ ఏడాదిలోనే బ్రహ్మోత్సవం

సాధారణంగా ఒక సినిమా పూర్తిచేసిన వెంటనే కాస్త గ్యాప్ తీసుకోవడం మహేష్ కు అలవాటు. ఆగడు సినిమా ముందు వరకు ఇదే పద్దతి ఫాలో అయ్యాడు మహేష్. కానీ ఈమధ్య కాలంలో తన పంథా పూర్తిగా మార్చుకున్నాడు. సినిమా-సినిమాకు మధ్య ఏమాత్రం గ్యాప్ ఇవ్వట్లేదు. ఇప్పుడు బ్రహ్మోత్సవం సినిమాకు కూడా అదే పద్దతి ఫాలో అవుతున్నాడు. ప్రస్తుతం చేస్తున్న శ్రీమంతుడు సినిమా పూర్తయిన వెంటనే బ్రహ్మోత్సవం సెట్స్ పైకి షిఫ్ట్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడు ప్రిన్స్. కొరటాల […]

ఈ ఏడాదిలోనే బ్రహ్మోత్సవం
X
సాధారణంగా ఒక సినిమా పూర్తిచేసిన వెంటనే కాస్త గ్యాప్ తీసుకోవడం మహేష్ కు అలవాటు. ఆగడు సినిమా ముందు వరకు ఇదే పద్దతి ఫాలో అయ్యాడు మహేష్. కానీ ఈమధ్య కాలంలో తన పంథా పూర్తిగా మార్చుకున్నాడు. సినిమా-సినిమాకు మధ్య ఏమాత్రం గ్యాప్ ఇవ్వట్లేదు. ఇప్పుడు బ్రహ్మోత్సవం సినిమాకు కూడా అదే పద్దతి ఫాలో అవుతున్నాడు. ప్రస్తుతం చేస్తున్న శ్రీమంతుడు సినిమా పూర్తయిన వెంటనే బ్రహ్మోత్సవం సెట్స్ పైకి షిఫ్ట్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడు ప్రిన్స్. కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న శ్రీమంతుడు సినిమాను ఈనెలాఖరుకు సెన్సార్ పూర్తిచేసి, ఆగస్ట్ 7న విడుదల చేయాలనుకుంటున్నాడు. ఈ సినిమా రిలీజ్ అయిన 2 రోజులకే బ్రహ్మోత్సవం ప్రారంభించాలనుకుంటున్నాడు మహేష్. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సినిమాను ఇప్పటికే ప్రారంభించాడు. హీరోయిన్లు కూడా ఫైనలైజ్ అయిపోయారు. సో.. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బ్రహ్మోత్సవం సెట్స్ పైకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాల-మహేష్ కాంబోలో వస్తున్న రెండో సినిమా ఈ బ్రహ్మోత్సవం. సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారు.
First Published:  23 July 2015 7:30 PM GMT
Next Story