Telugu Global
National

పార్లమెంటులో బీజేపీ కాంగ్రెస్‌ల యుద్ధం 

వ్యాపం, లలిత్ మోదీ వ్యవహారంపై పార్లమెంట్‌లో విపక్షాల నిరసనలు కొనసాగుతున్నాయి. సభ్యుల గందరగోళం మధ్య ఉభయసభలూ ఈ నెల 27కు  వాయిదా పడ్డాయి. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా ప్రతిపక్షం సిద్ధంగా లేదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. పార్లమెంట్ సజావుగా సాగడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని రాజ్‌నాథ్ చెప్పారు. పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల్లో నాలుగో రోజు కూడా యుద్ధ‌ వాతావ‌ర‌ణం కొన‌సాగింది. ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రారంభ‌మైన లోక్‌స‌భ రోజు మొత్తం మీద […]

పార్లమెంటులో బీజేపీ కాంగ్రెస్‌ల యుద్ధం 
X
వ్యాపం, లలిత్ మోదీ వ్యవహారంపై పార్లమెంట్‌లో విపక్షాల నిరసనలు కొనసాగుతున్నాయి. సభ్యుల గందరగోళం మధ్య ఉభయసభలూ ఈ నెల 27కు వాయిదా పడ్డాయి. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా ప్రతిపక్షం సిద్ధంగా లేదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. పార్లమెంట్ సజావుగా సాగడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని రాజ్‌నాథ్ చెప్పారు. పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల్లో నాలుగో రోజు కూడా యుద్ధ‌ వాతావ‌ర‌ణం కొన‌సాగింది. ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రారంభ‌మైన లోక్‌స‌భ రోజు మొత్తం మీద ప‌ట్టుమ‌ని ఐదు నిమిషాలు కూడా సాఫీగా జ‌ర‌గ‌లేదు. అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరికి వ్యతిరేకంగా మరొకరు ప్లకార్డులు పట్టుకుని నిరసనలు తెలియజేయడంతో సభ అనేకసార్లు స్తంభించిపోయింది. ప్ర‌తిప‌క్ష స‌భ్యులు ఐపీఎల్ స్కాం, వ్యాపం స్కామ్‌ల‌తో పాటు, టీఆర్ ఎస్ నేత జితేంద‌ర్‌రెడ్డి ఇచ్చిన తెలంగాణకు ప్ర‌త్యేక హైకోర్టు అంశంపై వాయిదా తీర్మానాలను కూడా స్పీక‌రు తిర‌స్క‌రించారు. దీంతో ప్ర‌తిప‌క్షాలు స‌భ‌ను స్తంభింప చేశారు. కాంగ్రెస్ నేతల ఆరోప‌ణ‌ల‌కు అధికార నేత‌లు చేసిన ప్ర‌త్యారోప‌ణ‌ల‌తో లోక్ స‌భ యుద్ధ వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పించింది.అధికార పార్టీ అవినీతి కుంభ‌కోణాలపై కాంగ్రెస్ స‌భ్యులు ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శిస్తే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల అవినీతిని బీజేపీ స‌భ్యులు ప్ల‌కార్డుల‌తో ప్ర‌ద‌ర్శించారు. అంతేకాదు సోనియా అల్లుడు ఫేస్‌బుక్‌లో చేసిన కామెంట్‌పై బీజేపీ స‌భ్యులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాబ‌ర్ట్‌వ‌ద్రాను స‌భకు ర‌ప్పించి శిక్షించాల‌ని, స‌భాహ‌క్కుల ఉల్లంఘ‌న కింద నోటీసులు ఇవ్వాల‌ని కోరారు. దీంతో ప్ర‌జాస‌మ‌స్య‌లు ఏవీ చ‌ర్చించ‌కుండానే మ‌రో రోజు గ‌డిచి పోయింది.
First Published:  24 July 2015 4:44 AM GMT
Next Story