Telugu Global
Others

ల‌వ్ ఎఫైర్స్‌తో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు?!!

కేంద్ర వ్య‌వ‌సాయ‌మంత్రికి ఎంత బ‌లుపు..?!!! ఓవైపు దేశంలో రైతులు అన్యాయంగా చ‌నిపోతున్నారు. వ‌రుస‌గా ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. నీళ్లు లేక‌..పంట‌లు పండ‌క‌..గిట్టుబాటు ధ‌ర లేక‌..అప్పుల‌పాలై బ‌ల‌వన్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డుతున్నారు. కేంద్రంలో మోదీ స‌ర్కారు అధికారంలోకివ‌చ్చిన ఈ ఏడాది కాలంలోనే దేశంలో రైతు ఆత్మ‌హ‌త్య‌లు 26శాతం పెరిగాయి. వైఫ‌ల్యాన్ని ఒప్పుకుని ఇప్ప‌టికైనా రైతుల్లో స్థైర్యాన్ని నింపాల్సిన మోదీ కేబినెట్ మంత్రులు పిచ్చికూత‌లు కూస్తున్నారు. రైతు ఆత్మ‌హ‌త్య‌ల‌కు ల‌వ్ ఎఫైర్లు కార‌ణ‌మ‌ని దారుణ‌మైన వ్యాఖ్య‌లు చేశారు కేంద్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి రాధా మోహ‌న్‌సింగ్‌! అంతేకాదు […]

ల‌వ్ ఎఫైర్స్‌తో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు?!!
X

కేంద్ర వ్య‌వ‌సాయ‌మంత్రికి ఎంత బ‌లుపు..?!!!
ఓవైపు దేశంలో రైతులు అన్యాయంగా చ‌నిపోతున్నారు. వ‌రుస‌గా ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. నీళ్లు లేక‌..పంట‌లు పండ‌క‌..గిట్టుబాటు ధ‌ర లేక‌..అప్పుల‌పాలై బ‌ల‌వన్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డుతున్నారు. కేంద్రంలో మోదీ స‌ర్కారు అధికారంలోకివ‌చ్చిన ఈ ఏడాది కాలంలోనే దేశంలో రైతు ఆత్మ‌హ‌త్య‌లు 26శాతం పెరిగాయి. వైఫ‌ల్యాన్ని ఒప్పుకుని ఇప్ప‌టికైనా రైతుల్లో స్థైర్యాన్ని నింపాల్సిన మోదీ కేబినెట్ మంత్రులు పిచ్చికూత‌లు కూస్తున్నారు. రైతు ఆత్మ‌హ‌త్య‌ల‌కు ల‌వ్ ఎఫైర్లు కార‌ణ‌మ‌ని దారుణ‌మైన వ్యాఖ్య‌లు చేశారు కేంద్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి రాధా మోహ‌న్‌సింగ్‌! అంతేకాదు మ‌గ‌త‌నం లేక‌పోవ‌డం, డ్ర‌గ్స్‌కు అల‌వాటు ప‌డ‌టం కూడా రైతు ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌ణ‌మ‌ని ప‌నికిమాలిన మాట‌లు వాగారు. అప్పులు తీర్చ‌లేక ఓవైపు రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటుంటే..క‌నీస మాన‌వ‌త్వం లేకుండా కేంద్ర వ్య‌వ‌సాయ మంత్రి చేసిన వ్యాఖ్య‌లు విమ‌ర్శ‌ల‌పాల‌వుతున్నాయి.

రైతు వ్య‌తిరేక ప్ర‌భుత్వం:
మోదీ స‌ర్కారు అన్న‌దాత‌ల క‌ష్టాల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు రాహుల్‌గాంధీ. అనంత‌పురం జిల్లా ఓబుళ‌దేవ‌ర చెరువులో ప‌ది కిలోమీట‌ర్ల పాద‌యాత్ర చేప‌ట్టిన రాహుల్‌, మోదీ సర్కారు అంబానీల‌కు,అదానీలు వంటి ఐదారుగురు పారిశ్రామికవేత్త‌ల‌కు మాత్ర‌మే ఉప‌యోగ‌ప‌డుతోంద‌ని మండిప‌డ్డారు. త‌న కేబినెట్ స‌హ‌చ‌రుల‌ను ఓసారి రైతుల ఇళ్ల‌కు పంపి నిజాలు తెలుసుకునేలా చేయాల‌ని ప్ర‌ధానికి సూచించారు.

రైతు ఆత్మ‌హ‌త్య‌ల‌పై ఇన్‌సెన్సిటివ్‌గా మాట్లాడిన కేంద్ర వ్య‌వ‌సాయ‌మంత్రి రాధామోహ‌న్‌సింగ్‌పై ఆప్ నేత‌లు భ‌గ్గుమ‌న్నారు. ఆయ‌న‌పై ప్రివిలెడ్జ్ మోష‌న్ ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని జెడియు ప్ర‌క‌టించింది. మ‌రోవైపు ఈ అంశాన్ని పార్ల‌మెంటులో నిల‌దీయ‌డానికి సిపిఎం సిద్ధ‌మ‌వుతోంది.

గ‌తంలో కూడా బీజేపీ నేత‌లు రైతు ఆత్మ‌హ‌త్య‌ల‌పై ఇన్‌సెన్సిటివ్ కామెంట్స్ చేశారు.
ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్న రైతులు క్రిమిన‌ల్స్ అనీ., వారి కుటుంబాల‌కు న‌ష్ట‌ప‌రిహారం ఎందుకు ఇవ్వాలంటూ హ‌ర్యానా వ్య‌వ‌సాయ మంత్రి నీచ‌మైన వ్యాఖ్య‌లు చేశారు.

నేత‌లు ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని మాట్లాడాలి!
ప్ర‌పంచంలో తాను క‌ష్టాల‌పాలైనా జ‌నం ఆక‌లి తీరుస్తున్న‌త్యాగ‌ధ‌నులు ఎవ‌రైనా ఉన్నారంటే..వాళ్లు రైతులు మాత్ర‌మే! ఎంద‌రో పారిశ్రామిక‌వేత్త‌ల పాపాల‌కు ఎన్నో బ్యాంకులు మూత‌ప‌డ్డాయి. కానీ తాను తిన‌క‌పోయినా ఠంచ‌నుగా అప్పు చెల్లించేవాడు అన్న‌దాత మాత్ర‌మే! చేసిన అప్పులు తీర్చ‌లేక‌..రుణ‌మాఫీలు అంద‌క‌..ఇన్‌పుట్ స‌బ్సిడీలు, బీమాలు ఊసు లేక‌..న‌ష్టాల సేద్యం చేయ‌లేక..ఏటా వేలాది రైతులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. రాజ‌ధానులు, ప్రాజెక్టులు, సెజ్‌ల కోసం విలువైన భూములను కోల్పోయి రోడ్డున‌ప‌డ్డారు. పాల‌కుల‌కు అంబానీల‌పై ఉన్న‌శ్ర‌ద్ధ అన్న‌దాత‌పై ఎప్పుడూ లేదు. అలాంట‌ప్పుడు వాళ్ల ఆత్మ‌భిమానాన్నికించ‌ప‌రిచే విధంగా మాట్లాడ‌టానికి నోరెలావ‌స్తోంది!? ఎంత బ‌లుపు కాక‌పోతే రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు ల‌వ్ ఎఫైర్లు కార‌ణ‌మంటాడు కేంద్ర వ్య‌వ‌సాయ‌మంత్రి! ఆయ‌న‌స‌లు మ‌నిషేనా అన్న అనుమానం క‌లుగుతోంది..!

First Published:  24 July 2015 8:04 PM GMT
Next Story